మోడీతో ఆ ప్రధాని సెల్ఫీ ఎందుకు తీసుకున్నారు

Update: 2015-12-13 04:00 GMT
జపాన్ ప్రధాని భారత మీడియా మనసు దోచుకున్నారు. అత్యంత ప్రముఖులు ఎక్కడ పర్యటిస్తున్నా ఫోటోగ్రాఫర్లు ఫాలో అవుతారు. సరైన ఫోటోల కోసం వారు పడే పాట్లు అన్నిఇన్ని కావు. చాలా సందర్భాల్లో వారు చాలానే ఇబ్బందులు పడుతుంటారు. అయితే.. అలాంటి వాటిని ప్రముఖులు గుర్తించటం చాలా అరుదు. జపాన్ ప్రధాని స్థాయి వ్యక్తి ఒక ఫోటోగ్రాఫర్ ఇబ్బందిని గుర్తించటం ఆసక్తికరంగా మారటమే కాదు.. అయన తీరును విపరీతంగా పొగిడేస్తున్నారు. ఇంతకీ ఆ ఘటన ఎక్కడ జరిగిందంటే..

తాజాగా జపాన్ ప్రధాని భారత్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. భారత ప్రధాని మోడీతో కలిసి ఆయన అధ్యాత్మిక నగరమైన వారణాసికి వెళ్లారు. అక్కడ ప్రసిద్ధ గంగా హారతి కార్యక్రమంలో ఇద్దరు ప్రధానులు కలిసి పాల్గొన్నారు. దీనికి సంబంధించిన సరైన ఫోటోల కోసం ఫోటోగ్రాఫర్లు విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. కానీ.. సరైన స్టిల్స్ దొరక్క ఫోటో జర్నలిస్టులు విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని ఇద్దరు ప్రధానులు గుర్తించి.. ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీసేందుకు వీలుగా వారు ప్రయత్నించారు.

అదే సమయంలో ఒక మహిళా ఫోటో జర్నలిస్ట్ తన సెల్ ఫోన్ తో ఇద్దరు ప్రధానులు కలిసి ఉన్న ఫోటో సెల్ఫీ తీసి ఇవ్వాలని కోరటం.. దీనికి జపాన్ ప్రధాని సానుకూలంగా స్పందించటం జరిగిపోయాయి. ఫోటో జర్నలిస్టు దగ్గర సెల్ తీసుకున్న జపాన్ ప్రధాని మోడీతో కలిసి సెల్ఫీ తీసి సెల్ ఫోన్ ను ఆమె చేతికి ఇచ్చారు. ఒక మహిళా ఫోటోజర్నలిస్ట్ ఇబ్బందిని జపాన్ ప్రధాని స్థాయి వ్యక్తి గుర్తించటం కాస్తంత విశేషమే కదూ.
Tags:    

Similar News