భారత సిలికాన్ వ్యాలీగా పేరు ప్రఖ్యాతులున్న గార్డెన్ సిటీ బెంగళూరు తీవ్రవాదులకు అడ్డాగా మారుతుందా? ప్రపంచాన్ని వణికిస్తున్న ఐఎస్ రాక్షసుల దండుకు చెందిన భారత దళపతి మహానగరంలో తిష్టవేశాడా? ఎసీ మెకానిక్ గా సాదాసీదా జీవితాన్ని గడుపుతూ.. మహా విధ్వంసానికి ప్లాన్ చేస్తున్నాడా? లాంటి ప్రశ్నలకు తాజాగా ఔననే చెబుతున్నాయి పోలీసు వర్గాలు. తాజాగా బెంగళూరులోని పరప్పన అగ్రహార ప్రాంతంలో ఎసీ మెకానిక్ గా రహస్య జీవితం గడుపుతున్న రఫిక్ అహ్మద్ ను తాజాగా నాలుగు రాష్ట్రాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఢిల్లీకి చెందిన రఫిక్ అహ్మద్ బెంగళూరులో కొద్ది కాలంగా ఉంటున్నాడు. నెలకు రూ.3,200 అద్దెతో చిన్న గదిలో కాలం గడుపుతున్న అతగాడు కర్ణాటకు చెందిన ఒక మహిళను పెళ్లి చేసుకొని ఎసీ మెకానిక్ గా బతికేస్తున్నాడు. ఎసీ మెకానిక్ అని చెప్పుకుంటూ ఐఎస్ సంస్థ తరఫున పని చేసేందుకు రిక్రూట్ మెంట్ చేపట్టటంతో పాటు.. భారీగా మెట్రో నగరాల్లో విధ్వంసం సృష్టించాలన్న ప్రయత్నంలో ఉన్నట్లు చెబుతున్నారు.
ఇతగాడి గత చరిత్ర చూస్తే.. ఉగ్రకార్యకలాపాల్లో భాగస్వామ్య కనిపిస్తుంది. 2013 దిల్ సుఖ్ నగర్ వద్ద జరిగిన జంట పేలుళ్లు.. గోకుల్ ఛాట్.. అహ్మదాబాద్ పేలుళ్ల ఘటనల్లో ఇతడికి భాగస్వామ్యం ఉంది. మొదట్లో జైషే అహ్మద్ సంస్థ తరఫున పని చేసిన అతడు.. గత కొద్దికాలంగా ఇస్లామిక్ స్టేట్ యాక్టివ్ గా మారటం.. తన దుర్మార్గాలతో ప్రపంచంలోని పలు దేశాల్లో విధ్వంసం సృష్టించటంతో ఐసిస్ తరఫున పని చేస్తున్నట్లు చెబుతున్నారు. భారత్ లో రిక్రూట్ మెంట్ కు కీలకమైన రఫిక్ ను అదుపులోకి తీసుకోవటం ఉగ్రవాదానికి చెక్ పెట్టటంలో పెద్ద ముందడుగుగా చెబుతున్నారు.