కర్నూలులో చోటు చేసుకున్న ఒక ఉదంతం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. స్థానికంగా హాట్ టాపిక్ గా మారిన ఈ ఉదంతంలోకి వెళితే.. తొమ్మిదో తరగతి చదివే స్టూడెంట్ తో 28 ఏళ్ల టీచర్ వెళ్లిపోయిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.
కర్నూలులోని పాతబస్తీకి చెందిన తొమ్మిదో తరగతి చదివే 14ఏళ్ల బాలుడు అక్కడికి దగ్గర్లోని స్కూల్లో చదువుతున్నాడు. అదే స్కూల్లో 28 ఏళ్ల యువతి టీచర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ నెల 3న ఇరువురు కలిసి తమ ఇళ్లల్లో చెప్పకుండా తెల్లవారుజాము ప్రాంతంలో వెళ్లిపోయారు.
ఈ విషయాన్ని గుర్తించిన ఇరు కుటుంబాల వారు పోలీసుల్ని ఆశ్రయించారు. దీంతో.. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమేరాల ఫీడ్ ను పరిశీలించగా వారిద్దరూ కర్నూలు రైల్వే స్టేషన్ లో తెలంగాణ ఎక్స్ ప్రెస్ ఎక్కినట్లుగా గుర్తించారు. వెంటనే.. రైల్వే పోలీసుల్ని అలెర్ట్ చేశారు. రంగంలోకి దిగిన భోపాల్ రైల్వే పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
వీరిని విచారించిన పోలీసులకు.. తాము ఢిల్లీ సైట్ సీయింగ్ చూసేందుకు వెళుతున్నట్లుగా చెప్పారని తెలిపారు. ఇరు కుటుంబాల వారు భోఫాల్ వెళ్లి తమ పిల్లల్ని వెనక్కి తీసుకొస్తున్నారు. ఢిల్లీ చూడాలనుకుంటే అందరికి చెప్పి వెళ్లొచ్చుగా..? ఎవరికి చెప్పకుండా చిన్న పిల్లాడ్ని 28 ఏళ్ల టీచర్ తీసుకెళ్లటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. కొన్ని సినిమాల్లోనూ.. ప్రాశ్చాత్య దేశాల్లో కనిపించే ఈ తరహా ధోరణి.. తమ దగ్గరే చోటు చేసుకోవట కర్నూలు పట్టణ వాసులకు షాకింగ్ గా మారింది.