భర్త గోవాలో .భార్య హైదరాబాద్ లో .. బెట్టింగ్‌ కు నిర్వహిస్తున్న దంపతుల అరెస్ట్

Update: 2020-10-22 13:50 GMT
భార్య .. భర్త జీవితంలో సగం అని అంటుంటారు కదా. దాన్ని తూచా తప్పకుండా పాటిస్తుంది ఓ మహిళ. భర్త చేసే మంచి పనిలోనే కాదు , చెడు పనుల్లో కూడా పాలు పంచుకుంటుంది. భర్త గోవా నుంచి క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తుంటే, భార్య హైదరాబాద్‌ లో నగదు వసూలు చేస్తూ భర్తకి చేదోడు వాదోడుగా ఉంటుంది. గట్టుచప్పుడు కాకుండా దందా నిర్వహిస్తున్న ఇద్దరు నిందితులు సుమన్‌ లత, రాహుల్‌ సింగ్ ‌లను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. ‌

అయితే , ఇప్పటివరకు బెట్టింగ్ ‌లో మగవారే పట్టుబడగా.. తాజాగా ఓ మహిళ చిక్కడం ఇదే తొలిసారి. టాస్క్‌ ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌ రావు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళ్‌హాట్‌ ప్రాంతానికి చెందిన ధరమ్‌ సింగ్‌.. నగరంలో క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తే పోలీసులకు అనుమానం వస్తుందని నెలన్నర కిందట గోవా వెళ్లాడు. ఐపీఎల్ ప్రారంభమయ్యాక తన భార్య సుమన్‎లతకు సోదరుడి వరుస అయ్యే రాహుల్ సింగ్‎కు నెలకు రూ.20 వేలు జీతం ఇస్తానని.. ఫోన్ ద్వారా బెట్టింగ్ కాసేవారి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించాడు. పదిహేను నంబర్లను రాహుల్‌ ఇవ్వగానే అతడు వారి పేర్లు రాసుకునేవాడు.

ఇటు, హైదరాబాద్‎ లో బెట్టింగ్‌ కాసిన వారి నుంచి ధరమ్ ‌సింగ్‌ భార్య సుమన్ ‌లత డబ్బులు వసూలు చేస్తోంది. వారి చిరునామాలు తెలుసుకుని ద్విచక్ర వాహనంపై అక్కడికి వెళ్లి డబ్బు తీసుకువస్తోంది. విశ్వసనీయ సమాచారంతో వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ధరమ్‌ సింగ్‌ ఇంట్లో సోదాలు నిర్వహించగా బెట్టింగుల వ్యవహారం వెలుగుచూసింది. బెట్టింగ్ నిర్వహిస్తున్న దంపతులను అరెస్ట్ చేశారు. నిందితులను ఒక టీవీ, 15 సెల్ ఫోన్లు, రూ.27వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.


Tags:    

Similar News