హెరిటేజ్ కేంద్రంగా డబ్బు పంపిణీ

Update: 2019-04-05 09:33 GMT
ఏపీలో ఎన్నికలకు ఇంకా ఆరు రోజులు మాత్రమే సమయం మిగలడంతో అధికార పార్టీ అక్రమాలకు తెరతీస్తోందని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. కోట్లాది రూపాయలను వెదజల్లి ఓటర్లను లోబర్చుకోవడానికి కుట్రపన్నిందని మండిపడుతున్నారు. చంద్రబాబు కు ఏపీలో పోలీస్ యంత్రాంగమంతా సహకరిస్తోందని.. దాంతోపాటు సొంత సంస్థ హెరిటేజ్ తోపాటు విశాఖ డైరీని డబ్బు పంపిణీకి వాడుకుంటున్నాడని ఆరోపిస్తున్నారు..

తాజాగా విశాఖ జిల్లా మకవరపాలెంలో హెరిటేజ్ పాల వ్యాన్ లో రూ.3.95లక్షలు తరలిస్తుండగా పోలీసులు పట్టుకోవడం కలకలం రేపింది. విశాఖలో పాలవ్యాన్ ల ద్వారా డబ్బులు తరలించి జిల్లాలోని ఓటర్లకు పంచేందుకు టీడీపీ నాయకులు ఏర్పాట్లు చేసుకోవడం.. దాన్ని ఎన్నికల స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేసి పట్టుకోవడంతో టీడీపీ గుట్టు రట్టయ్యింది. సొమ్ము తరలిస్తున్న వారిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశఆరు.

ఇటీవలే విశాక డెయిర్ వ్యాన్ లో రూ.6లక్షలు తరలిస్తుండగా పట్టుకోవడంతో టీడీపీ అక్రమాలు బయటపడ్డాయి. విశాఖ జిల్లాలో ప్రధానంగా హెరిటేజ్, విశాఖ డెయిరీ వ్యాన్లలో డబ్బులు పంపిణీ చేస్తున్నట్టు చెబుతున్నారు. అనకాపల్లి విశాఖ టీడీపీ అభ్యర్తి ఆడారి ఆనంద్ కుటుంబానికి చెందిందే ఈ విశాఖ డెయిరీ. దీని ద్వారానే పల్లెలకు కోట్ల రూపాయలు తరులుతున్నాయని సమాచారం. హెరిటేజ్ వ్యాన్లలో కూడా డబ్బుల రవాణా జరుగుతోందని తాజా గురువారం ఘటనతో అర్థమవుతోంది. ఇక విశాఖ టీడీపీ ఎంపీగా పోటీచేస్తున్న భరత్ తన విద్యాసంస్థలకు చెందిన బస్సులు, ఇతర వాహనాల ద్వారా డబ్బులు పంపిణీ చేస్తున్నట్టు వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు నాలుగున్నర కోట్ల నగదు పట్టుబడింది. ఇందులో 90శాతం టీడీపీ నేతలదేనని సమాచారం. దీంతో మరింత నిఘా పెట్టాలని ఈసీని ప్రతిపక్ష వైసీపీ కోరుతోంది.
    

Tags:    

Similar News