కరోనా నివారణ చర్యలలో పోలిసుల పాత్ర కూడా అమోఘం. కరోనా వచ్చిన వారికి డాక్టర్లు ఎలా అయితే ప్రాణాలకి తెగించి ట్రీట్ మెంట్ చేస్తున్నారో ..పోలీసులు కూడా లాక్ డౌన్ విధించిన మరుక్షణం నుండి రాత్రి - పగలు అన్న తేడా లేకుండా కుటుంబాలని వదిలేసి ప్రజల కోసమే విధుల్లో పాల్గొంటూ గుంపులు గుంపులుగా ఒక చోట చేరకుండా చూస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా వేళకు తిండి లేకున్నా - అప్పటికి ఏది దొరికితే అది తింటూ విధులకే అంకితమయ్యారు.
రాత్రనక పగలనక డ్యూటీ చేస్తున్న కొంతమంది పోలీస్ సిబ్బంది ఒత్తిడి తట్టుకోలేక పోతున్నారు. తాజాగా విధి నిర్వహణలో ఉన్న ఓ పోలీసు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది
ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే .. భోపాల్ లో డ్యూటీ చేస్తున్న చేతన్ సింగ్ ఒక్కసారిగా తన సర్వీసు గన్ బయటకు తీసి - గాల్లో ఫైరింగ్ చేసి - వెంటనే ఎడమ చేతిపై కాల్చుకున్నాడు. అది చూసిన ఇతర పోలీసులు హుటా హుటిన భోపాల్ లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే కరోనా సేవల్లో ఉన్న డాక్టర్లు - ఎంత బిజీగా ఉన్నా - చేతన్ సింగ్ కు ఎమర్జెన్సీ ట్రీట్ మెంట్ చేశారు. అయన ప్రస్తుతం కోలుకుంటున్నారు. అయితే , ఎందుకు చేశావని అతన్ని అడిగితే... అసలే చాలా పనులు చేస్తున్న తనకు అదనంగా కరోనా వైరస్ విధులు కూడా ఇచ్చారనీ - ఆ టెన్షన్లు తట్టుకోలేక ఇలా చేశానని చెప్పాడు.
కరోనా నుంచి కాపాడుకునేందుకు తనకు ఎలాంటి రక్షణ కవచాలూ లేవనీ - ఎక్కడ తనకు అది సోకుతుందోనని ప్రతీ క్షణం టెన్షన్ పడుతున్నానని - ఈ విషయాన్ని పై అధికారులకు చెప్పినా పరిస్థితుల వల్ల ఆ డ్యూటీ వెయ్యక తప్పట్లేదని అని చెప్పారని తెలిపాడు. చేతన్ ఇంతలా టెన్షన్ పడటానికి బలమైన కారణం ఉంది. భోపాల్ లో ఇప్పటికే 10 మంది పోలీస్ సిబ్బందికి కరోనా సోకింది. దీనితో మిగిలిన పోలీసుల్లో భయం మొదలైంది. దీనితో వారి సమస్యల పై పోలీస్ శాఖ దృష్టి పెట్టింది.