సింగర్ మధుప్రియ.. ఆమె భర్త శ్రీకాంత్ ల మధ్య మనస్పర్థలు రావటం.. మధుప్రియ పోలీసుల్ని ఆశ్రయించటం.. అనంతరం చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలు తెలిసిందే. శనివారం బయటకు వచ్చిన ఈ వ్యవహారం ఆదివారం సాయంత్రం.. వీరిద్దరికి పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించారు. హుమాయిన్ పోలీస్ స్టేషన్లో వీరికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గురు సైకాలజిస్ట్ లు వీరితో మాట్లాడటం గమనార్హం.
ఈ ముగ్గురు సైకాలజిస్ట్ లు మధుప్రియ.. శ్రీకాంత్ లతో విడివిడిగా మాట్లాడారు. ఈ సందర్భంగా తనకు కొంత సమయం కావాలని.. ఆ తర్వాత తాను ఆలోచించుకొని చెబుతానని మధుప్రియ వెల్లడించినట్లుగా చెబుతున్నారు. అదే సమయంలో ఆమె భర్త శ్రీకాంత్ మాత్రం మధుప్రియ తనతో ఉంటేనే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
తన తల్లిదండ్రులతో కలిసి రెండో కౌన్సెలింగ్ వరకూ ఉంటానని.. ఆ సమయంలో ఆలోచించుకొని తానేం చేయాలనుకున్నది చెబుతానని మధుప్రియ చెప్పారు. తనకు కొంత టైం కావాలని.. ఆ సమయంలో ఆలోచించుకొని శ్రీకాంత్ తో కలిసి ఉండటమా? లేదా? అన్న విషయాల్ని చెబుతానని చెప్పినట్లుగా తెలుస్తోంది. తాను ఆవేశంతోనే భర్త మీద ఫిర్యాదు చేసినట్లుగా మధుప్రియ పేర్కొన్నట్లు తెలుస్తోంది.
శ్రీకాంత్ మీద దాడి జరిగిన వ్యవహారం మధుప్రియ మీద ప్రభావం చూపించిందని.. అయితే.. భర్తతో కలిసి ఉండే విషయంపై ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేనని.. తల్లిదండ్రులతో కొద్దిరోజులు ఉన్న తర్వాత నిర్ణయం తీసుకోనున్నట్లు మధుప్రియ చెప్పారు.