మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ మీద శుక్రవారం తెల్లవారుజామున అతడి నివాసంలోనే కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. కుటుంబ కలహాలే కాల్పులకు కారణమై ఉండొచ్చన్నవదంతులు మొదట్లో వినిపించాయి. కాల్పుల సమాచారంతో విక్రమ్ గౌడ్ ఇంటికి వెళ్లిన పోలీసులు అక్కడ బయటి వ్యక్తులు వచ్చిన ఆనవాళ్లు కన్పించలేదని ప్రాథమికంగా నిర్థారించారు. అయితే, ఈ ఘటనపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు చానెళ్లతో వార్తలు వస్తున్నాయి. అప్పుల ఒత్తిళ్లు, విక్రమ్ నిర్వహించే పబ్ వ్యవహారం నేపథ్యంలో అతడు ఆత్మహత్యాయత్నం చేసి ఉంటాడని చానెళ్లలో కథనాలు వస్తున్నాయి.
విక్రమ్ గౌడ్ ఇంట్లో కాల్పుల ఘటనలో మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. విక్రమ్ కు డ్రగ్స్ రాకెట్ తో సంబంధం ఉందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. విక్రమ్ ఫోన్ లో గత పదిరోజులుగా డ్రగ్స్ దందాపై సిట్ చేస్తున్న విచారణ వివరాలను నిక్షిప్తం చేసుకున్నాడు. విక్రమ్ మొబైల్ లోని డేటాను తన భార్యకు పంపినట్లు తెలుస్తోంది. విక్రమ్ మాదాపూర్ లో ఓ పబ్ నిర్వహిస్తున్నాడు. ఆ పబ్ కు సంబంధించి డ్రగ్స్ తలనొప్పులు కూడా విక్రమ్ కు ఉన్నట్లు కొన్ని చానెళ్లతో వార్తలు వెలువడ్డాయి.
విక్రమ్ భారీగా అప్పుల్లో కూరుకుపోయినట్లు తెలుస్తోంది. గత 15 రోజుల్లో విక్రమ్ గౌడ్ కు 39 వాట్సాప్ మెసేజ్ లు వచ్చాయి. సుమారు కోటి రూపాయల వరకు అప్పులు చెల్లించాల్సిందిగా విక్రమ్ కు బెదిరింపులు వచ్చాయి. సిట్ విచారణ, అప్పుల బాధ తొలగించుకోవాలంటే తన ముందు ఉన్న ఏకైక మార్గం ఆత్మహత్యాయత్నం అని ఆయన భావించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు... క్లూస్ టీం సాయంతో విక్రమ్ ఇంటిని నిశితంగా పరిశీలిస్తున్నారు. విక్రమ్ ఇంట్లో సోఫాలోని రక్తం మరకలు తుడిచి వేయడం పై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విక్రమ్ పై దేశవాళీ తుపాకీతో కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. అక్కడ దొరికిన బుల్లెట్స్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.