న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరిట అమరావతి రైతులు నిర్వహిస్తున్న మహాపాదయాత్ర ప్రస్తుతం నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పరిధిలో సాగుతోంది. అమరావతి రాజధాని కోసం వేలాది మంది రైతులు 33 వేల ఎకరాలు ఇవ్వటం.. జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక అమరావతికి బదులుగా మూడు రాజధానుల నిర్ణయాన్ని తీసుకోవటం తెలిసిందే. దీన్ని తప్పు పడుతూ దాదాపు 700 రోజులకు పైనే అమరావతి జేఏసీ ఆందోళనను నిర్వహిస్తోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చేస్తున్న ఆందోళనలో భాగంగా.. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో చేపట్టిన మహా పాదయాత్ర గడిచిన 30 రోజులుగా సాగుతోంది.
ఇప్పటికే ఆంక్షలతో పాదయాత్ర చేస్తున్న మహిళలకు పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురి చేస్తున్నట్లుగా వార్తలు రావటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా పాదయాత్రలో భాగంగా భోజనాలు చేసేందుకు ఒక ప్లేస్ ను ఎంపిక చేసుకొని.. ఏర్పాట్లు చేసుకుంటే.. తమకు పెద్ద ఎత్తున ఒత్తిళ్లు వస్తున్నాయని.. అక్కడ నుంచి వెళ్లిపోవాలని భూమి యజమానులు కోరినట్లుగా అమరావతి రైతు జేఏసీ నేతలు చెబుతున్నారు.
దీంతో మధ్యాహ్న భోజనాన్ని రోడ్ల పక్కన కూర్చొని చేయాల్సి వస్తోంది. దీనిపై పాదయాత్రలో పాల్గొన్న మహిళా రైతు ఒకరు తన ఆవేదనను వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఆమె వెల్లడించిన వివరాల్ని చూసినప్పుడు.. మహా పాదయాత్రపై ఏపీ పోలీసులు ఇంతటి ఆంక్షల్ని అమలు చేస్తున్నారా? అన్న విస్మయానికి గురి చేయక మానదు. ఇక.. సోషల్ మీడియాలో కొత్త చర్చకు తెర తీసిన ఒక వీడియో క్లిప్పింగ్ లోని అంశాలు.. మహాపాదయాత్ర లో పాల్గొన్న మహిళా రైతులు పడుతున్న కష్టాలు ఇంత దారుణంగా ఉన్నాయా? అన్న భావన కలుగక మానదు.
పాదయాత్ర కోసం జేఏసీ ఏర్పాటు చేసిన బయో టాయిలెట్లను సైతం పోలీసులు తొలగించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాదయాత్ర చేసే మహిళలు రోజుకు 20 కి.మీ. చొప్పున నడవాల్సి ఉంటుంది. అందుకోసం వారు మంచినీళ్లు ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో.. వారు టాయిలెట్లకు వెళ్లాల్సిన పరిస్థితి. ఇలాంటివేళ.. బయో టాయిలెట్లను తొలగిస్తున్న పోలీసుల వైఖరిని తీవ్రంగా తప్ప పడుతున్నారు. ఇంతటి దుర్మార్గ వైఖరి పాలకుల్లో ఎప్పుడూ చూడలేదన్న ఆవేదనను పలువురు వ్యక్తం చేస్తున్నారు.
పాదయాత్రలో భాగస్వామి అయిన ఒక మహిళా రైతు ఆవేదనను ఆమె మాటల్లో వింటే.. ''నడవలేమండి.. ఆత్మాభిమానం అడ్డొస్తోందండి. ఇంత దుర్మార్గమండి.. ఇంత అన్యాయమా? మేం రోజుకు 20కిలోమీటర్లునడుస్తున్నాం. జేఏసీ వారు బయోటాయిలెట్లు ఇచ్చారండి. ఈ రోజున ఆ టాయిలెట్లు కూడా పోలీసులు పీకేశారండి. లేడీస్ టాయిలెట్లకు వెళ్లాలంటే ఎంత ఇబ్బంది అండి. చెట్ల చాటున.. పుట్టల చాటున.. ఎంత సిగ్గుతో చచ్చిపోతున్నామండి. ఇవాళ రోడ్డు మీద పడి.
ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉంటుందా? మమ్మల్ని రోడ్డు మీదకు తీసుకొచ్చిన పాలకులు ఇంత దుర్మార్గంగా వ్యవహరించటమా? కిలోమీటర్ల కొద్దీ నడవాలంటే వాటర్ తాగాలి. వాటర్ తాగితే టాయిలెట్లకు వెళ్లాలి. ఈ బయో టాయిలెట్లు కూడా పీకించేసి.. ఇంత క్రూరంగా వ్యవహరించటమా? ఇంత అమానుషమా? ఒకవైపు ఆత్మాభిమానం దెబ్బ తింటోంది.. మరోవైపు తినకపోతే కడుపు ఆకలితో మండుతుంది. మాకేమిటీ ఖర్మ? ఎంత సిగ్గు చేటు?'' అంటూ ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు.
రోజుకు తినే తిండి కోసం కోసం తిప్పలు పడాల్సి వస్తోందని.. తమ ఇంటికి వచ్చిన ఎంతో మందికి అన్నం పెట్టిన తాను.. ఈ రోజున అన్నం తినటం కోసం రోడ్డు పక్కన కూర్చొని తినాల్సిన దుస్థితి ఏర్పడిందంటూ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఏమైనా.. మహాపాదయాత్రలో మహిళల కోసం ఏర్పాటు చేసిన బయో టాయిలెట్లను తొలగించే దుర్మార్గ చర్యకు పాలకులు ఇప్పటికైనా చెక్ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు.
https://twitter.com/AbdulRa99443551/status/1466065220539801601