సీఎం ర‌మేశ్ ఇంట్లో సోదాలు.. బెడ్రూంలోకి పోలీసులు!

Update: 2019-04-05 06:18 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితుడు.. ఆయ‌న రైట్.. లెఫ్ట్ హ్యాండుల్లో ఒక‌రుగా చెప్పే ఆయ‌న ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వ‌హించ‌టం సంచ‌ల‌నంగా మారింది. రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్న ఆయ‌న ఇంట్లోకి 50 మంది పోలీసులు ప్ర‌వేశించి త‌నిఖీలు నిర్వ‌హించారు. క‌డ‌ప‌జిల్లాలోని పోట్ల‌దుర్తిలోని ఆయ‌న నివాసంలోకి పోలీసులు సెర్చ్ వారెంట్ లేకుండా వ‌చ్చిన‌ట్లుగా సీఎం ర‌మేశ్ ఆరోపిస్తున్నారు.

జిల్లా ఎస్పీ ఆదేశాల మేర‌కే ఇంట్లో సోదాలు నిర్వ‌హించిన‌ట్లుగా పోలీసులు చెప్పిన‌ట్లు తెలుస్తోంది. వారెంట్ లేకుండా సోదాలు ఎలా చేస్తార‌న్న ప్ర‌శ్న‌కు పోలీసుల నుంచి స‌మాధానం లేదు. పోలీసులు ఆయ‌న బెడ్రూంలోకి కూడా వెళ్లిన‌ట్లు సీఎం ర‌మేశ్ చెప్పారు.  ఇటీవ‌ల వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ నేత‌ల ఫిర్యాదు మేర‌కు క‌డ‌ప ఎస్పీని బ‌దిలీ చేయ‌టం.. ఆయ‌న స్థానంలో వ‌చ్చిన కొత్త ఎస్పీ తీరుపై తెలుగుదేశం పార్టీ నేత‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ఒక‌వైపు టీడీపీకి చెందిన ప‌లువురు నేత‌ల ఇళ్ల‌పై ఐటీ..ఈడీ దాడులు చేస్తున్న వేళ‌.. మ‌రోవైపు సీఎంకు అత్యంత స‌న్నిహితుడి ఇంట్లోకి 50 మంది ప్ర‌వేశించి సోదాలు నిర్వ‌హించ‌టం కొత్త చ‌ర్చ‌కు తెర తీసింది. ఇప్ప‌టివ‌ర‌కూ అందిన స‌మాచారం ప్ర‌కారం సీఎం ర‌మేశ్ ఇంట్లో ఏమీ ల‌భించ‌లేద‌ని తెలుస్తోంది. 
Tags:    

Similar News