మాజీమంత్రి అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ పై ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఆయనను అరెస్టు చేసేందుకు ఆళ్ళగడ్డ పోలీసులు ప్రయత్నిస్తే దొరికినట్లే దొరికి తప్పించుకు తిరుగుతున్న భార్గవ రామ్ కోసం హైదరాబాద్ కేంద్రంలో పోలీసులు జల్లెడ పడుతున్నారు. అయితే దొరికినట్లే దొరికి తప్పించుకు తిరుతున్న భార్గవ రామ్ పై మరో కేసు కూడా నమోదు అయింది. వాస్తవానికి ఆళ్లగడ్డలో ఉన్న క్రషర్ క్వారీ ఫ్యాక్టరీ వివాదంలో యజమాని శివరామిరెడ్డి ఫిర్యాదు మేరకు భార్గవ్ రామ్ తో సహా 10మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
క్రషర్ ఇండస్ట్రీ పూర్తిగా తమకే ఇవ్వాలని అఖిలప్రియ భర్త బెదిరింపులకు పాల్పడటంతో శివరామిరెడ్డి పోలీసుల్ని ఆశ్రయించాడు. మరోవైపు అఖిలప్రియ - భార్గవ్ రామ్ పీఏ మహేష్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు అయినవారిలో ఏ1 ముద్దాయిగా మాజీ మంత్రి అఖిల ప్రియ భర్త మద్దూరు భార్గవ్ రామ్ నాయుడు - ఏ2 గా మాదల శ్రీను - ఏ3 గా నాగిరెడ్డి పల్లె శేఖర్ రెడ్డి - ఏ4 గా శ్రీను - ఏ5 గా అల్లా సుబ్బయ్య - ఏ6 గా నాగేంద్ర - ఏ7 గా డ్రెవర్ గణేష్ - ఏ8 గా మంగలి పవన్ - ఏ9 గా మహేష్ (పీఏ) - ఏ10 గా సంపత్ నాని - ఏ11గా షరీఫ్ కేసులో ఉన్నారు.
అయితే అఖిల ప్రియ భర్త భార్గవరామ్ కోసం ఆళ్లగడ్డ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. గత రెండ్రోజులుగా పోలీసులకు చిక్కినట్లే చిక్కి తప్పించుకుని తిరుగుతున్నట్లు తెలుస్తోంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు ఓ పోలీసుపై కారును పోనిచ్చాడన్న కేసులు కూడా భార్గవరామ్ పై నమోదయ్యాయి. ప్రస్తుతం ఆళ్లగడ్డ పీఎస్ లో రెండు కేసులు - గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఓ కేసు నమోదు అయ్యాయి. రెండ్రోజుల కిందట హైదరాబాద్ లో భార్గవరామ్ ను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు.
అయితే కారును ఆపినట్లే ఆపి.. ఆ తర్వాత వేగంగా కారును డ్రైవ్ చేసుకుని వెళ్లాడని ఆళ్లగడ్డ ఎస్ ఐ అంటున్నారు. అంతేకాదు కారును తమపైకే పోనిచ్చాడని ఎస్ ఐ సోమేష్ కుమార్ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీస్ డిపార్ట్ మెంట్ అఖిలప్రియ భర్త కోసం గాలింపును ముమ్మరం చేసింది. ప్రస్తుతం అతనిపై ఐపీసీ సెక్షన్ 353 - 336 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు భార్గవ రామ్ దొరకపోవడంతో హైదరాబాద్ పోలీసుల సాయంతో గచ్చిబౌలిలో ముమ్మరంగా వెతుకుతున్నారు ఏపీ పోలీసులు.