కాపీయింగ్ లో అడ్డంగా బుక్ అయిన నేతాశ్రీలు

Update: 2016-03-25 05:28 GMT
నేతలుగా పేరు ప్రఖ్యాతులు.. గుర్తింపులు ఉన్న వారికి ఉన్నట్లుండి చదువు మీద ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందేమో కానీ.. వారికి కొత్త తిప్పలు తీసుకురావటమే కాదు.. తలెత్తుకోకుండా చేసింది. అడ్డమార్గంలో ఉన్నత విద్యను అభ్యసించినట్లుగా కనిపించాలనుకున్న వారు.. తమలోని మరో కోణాన్ని ప్రదర్శించి అడ్డంగా దొరికిపోయిన వైనం హాట్ టాపిక్ గా మారింది.

నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో జరిగే లా రెగ్యులర్ కోర్సులో తొలి సంవత్సరం పరీక్షలు రాస్తున్న గుంటూరు మాజీ ఎమ్మెల్యేతో సహా.. గుంటూరుకు చెందిన మరో ఇద్దరు నేతలు వార్షిక పరీక్షల్లో కాపీ కొడుతూ అధికారులకు దొరికిపోవటం ఇప్పుడు చర్చగా మారింది. గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీతో పాటు.. వివిధ పార్టీ నేతలు ఆర్ భాస్కర్ రావు.. ఎస్.కె. జిలానీలు అధికారుల తనిఖీల్లో దొరికిపోయారు.

ఈ నెల 14 నుంచి మొదలైన లా మొదటి సంవత్సరం వార్షిక పరీక్షల్లో ఆఖరి పరీక్ష గురువారం నిర్వహించారు. గుంటూరు నగరంలోని ఏసీ కాలేజీలో పరీక్షలు రాస్తున్న ఈ నేతలు ముగ్గురు స్వ్కాడ్ బృందానికి కాపీయింగ్ చేస్తూ దొరికిపోయారు. ఉన్నత విద్యను అభ్యసిస్తున్నట్లు గొప్పల మాటేమో కానీ.. తాజాగా పట్టుబడిన వైనంతో అడ్డంగా దొరికిపోవటం గమనార్హం.
Tags:    

Similar News