ఏపీలో వచ్చే ఎన్నికలకు సంబంధించి పక్కా వ్యూహంతో ముందుకు సాగాలని.. అధికార పార్టీ వైసీపీని మరోసారి గద్దెనెక్కకుండా చూడాలని.. వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకు ఎక్కడా చీలకుండా.. జాగ్రత్త పడాల ని పదే పదే చెబుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తాజాగా బీజేపీ ముందు.. మూడు కీలక ఆప్షన్లు ఇచ్చారనే చర్చ సాగుతోంది. దీనికి సంబంధించి అధికారికంగా.. జనసేన నుంచి ఎలాంటి ప్రకటన లేకు న్నా.. పవన్ తాజాగా ఢిల్లీలో పర్యటించడం.. బీజేపీ పెద్దలను కలుసుకోవడం వంటి పరిణామాలతో రాజకీ యాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
''ఇప్పటికే ఏపీ నాశనమైపోయింది. వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే... పూర్తిగా నాశనమే. ఎట్టిపరిస్థి తుల్లోనూ వైసీపీని గద్దెదించాల్సిందే. ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా మన అడుగులు, పొత్తులూ ఉండాలి'' అని బీజేపీ అధిష్ఠానానికి పవన్ కుండబద్దలు కొట్టి మరీ చెప్పిన ట్టు ఢిల్లీ రాజకీయ వర్గాలు చెబుతున్నా యి. నిజానికి కొన్నాళ్లుగా.. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వను అని పవన్ పదేపదే చెబుతున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ఇప్పటికే పొత్తులో ఉన్న బీజేపీతో ఆయన ఈ దిశగానే చర్చలు చేస్తున్నారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికలకు సంబంధించి.. పొత్తుల విషయంలో పవన్ మూడు 'ఆప్షన్లు' బీజేపీ ముందు పెట్టారని అంటున్నారు. 1) బీజేపీతో కలిసి అధికారంలోకి రావడం. 2) బీజేపీ, టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్లడం. 3) జనసేన ఒంటరి పోరు. అంటే.. టీడీపీతో కలిసి ముందుకు సాగడం. ఈ మూడు విషయాల్లో ఏదో ఒక తేల్చేస్తే.. తమ దారి తాము చూసుకుంటామన్నట్టుగా.. జనసేనాని గట్టిగానే బీజేపీకి తేల్చి చెప్పారని సమాచారం.
రాజకీయ సమీకరణలు, పొత్తులతోపాటు... రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు రాజకీయంగా వేయాల్సి న ఎత్తుగడలు, అనుసరించాల్సిన వ్యూహాలపై పవన్ ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది. జగన్ పరిపా లన తీరు, ప్రతిపక్షాలపై జరుగుతున్న దాడులు, శాంతిభద్రతలకు విఘాతం వంటి అంశాలను పవన్ ప్రస్తావించారని అంటున్నారు.
''మరోసారి జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రం దుంపనాశనవుతుంది. జగన్ పాలనపై ప్రజల్లో తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తమవుతోంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని వాస్తవ దృక్పథంతో రాజకీయంగా అడుగులు వేద్దాం'' అని పవన్ సూచించినట్లు తెలిసింది.
మరి వచ్చే ఎన్నికలకు సంబంధించి పవన్ ఇంత స్పష్టంగా ఉన్న నేపథ్యంలో బీజేపీ నాయకులు ఎలాంటి వైఖరి తీసుకుంటారో చూడాలి. అయితే.. ఎలాంటి వైఖరి తీసుకున్నా.. బీజేపీ నాయకులు ఇప్పటికిప్పుడు ఏమీ తేల్చేయరని.. ఈ ఏడాది చివరిలో జరగనున్న గుజరాత్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చే ఫలితాలను బట్టే నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.