ఒంట‌రైన గంటా.. ప‌ట్టించుకోని పార్టీలు..!

Update: 2021-08-21 11:30 GMT
మాజీ మంత్రి, సీనియ‌ర్ నాయ‌కుడు.. గంటా శ్రీనివాస‌రావు ఇప్పుడు ఒంట‌ర‌య్యారా ?  ఒక‌ప్పుడు ఆయ‌న కోసం ఎదురు చూసిన పార్టీలు.. నేతలు.. ఆయ‌న‌ను దూరం పెట్టారా ? ఆయ‌న మౌనం.. త‌ట‌స్థ వైఖ‌రి.. రాజ‌కీయంగా గంటాకు తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తున్నాయా ? అంటే.. అవున‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. నిజానికి రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన గంటా శ్రీనివాస‌రావు.. న‌వ‌య‌వ్వ‌నంలో ఉన్నార‌నే చెప్పాలి. ఎందుకంటే.. ఆయ‌న ఇప్ప‌టికి రాజ‌కీయాల్లోకి వ‌చ్చి స‌రిగ్గా 22 ఏళ్లు పూర్త‌య్యాయి. 1999కి ముందుగానే రాజ‌కీయ అరంగేట్రం చేసినా, ఆ ఎన్నిక‌ల్లోనే తొలిసారి ఆయ‌న విశాఖ జిల్లా అన‌కాప‌ల్లి నుంచి ఎంపీగా పోటీ చేశారు.

సో.. ఆ సంవ‌త్సరాన్ని ప్రాతిప‌దిక‌గా తీసుకున్నా.. 22 సంవ‌త్స‌రాలు పూర్త‌య్యాయి. కాబ‌ట్టి.. ఇప్పుడు ఉన్న‌ది కీల‌క‌మైన స‌మ‌యమనే చెప్పాలి. అదే స‌మ‌యంలో ఆయ‌న త‌న ఆకాంక్ష అయిన మంత్రి ప‌దవిని ద‌క్కించుకున్నా.. రాష్ట్రంలో ముద్ర వేయ‌గ‌ల రీతిలో ఆయ‌న చేప‌ట్టిన ప‌ద‌వులు లేవ‌నే అంటారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. య‌న‌మ‌ల రామ‌కృష్ణుడుని తీసుకుంటే.. స్పీక‌ర్‌గా.. ఆర్థిక మంత్రిగా త‌న‌దైన ముద్ర వేశారు. అదే స‌మ‌యంలో ఇత‌ర నేత‌ల‌ను తీసుకున్నా..ఒక‌రిద్ద‌రు త‌మ‌దైన ముద్ర వేసుకున్నారు. కానీ, గంటా.. మాత్రం విద్యాశాఖ మంత్రిగా చేసినా.. గ‌తంలో కాంగ్రెస్ హ‌యాంలో మంత్రిగా చేసినా.. కూడా అవి పెద్ద‌గా గుర్తింపు తీసుకురాలేదు.

సో.. ఈ ప‌రిణామాల‌ను బ‌ట్టి.. గంటా ఫ్యూచ‌ర్ ఇప్ప‌టితో అంత‌మై పోయింద‌ని.. ఆయ‌న‌కు ఇక‌, ఫ్యూచ‌ర్ లేద‌ని.. చెప్ప‌డానికి అవ‌కాశం లేదు. అయితే.. ప్ర‌స్తుతం ఈ దిశ‌గా గంటా చేస్తున్న‌ప్ర‌య‌త్నాలు క‌నిపించ‌డం లేదని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. ఆయ‌న టీడీపీలో ఉన్నా.. ప‌ట్టించుకునే వారు క‌రువ‌య్యారు. అంతేకాదు.. ఈయ‌న పార్టీలో ఉంటారో.. లేదో.. అనే చ‌ర్చ‌ల‌తో కొన్నాళ్లుగా టీడీపీ ఆయ‌న‌ను లెక్క చేయ‌డం కూడా మానేసింది. అనేక మందికి.. ప‌ద‌వులు ఇచ్చినా.. ఈయ‌న‌కు మాత్రం ఎలాంటి ప‌ద‌వినీ అప్ప‌గించ‌లేదు.

పోనీ.. వైసీపీలోకి వెళ్తార‌నే చ‌ర్చ జ‌రిగినా.. ఆయ‌న‌కు అక్క‌డ కూడా రిజ‌ర్వ్ కాలేదు. ఇక‌, విశాఖ ఉక్కు క‌ర్మాగారం కోసం.. త‌న ప‌ద‌వికి రాజీనామా చేసినా మార్కులు పొంద‌లేక పోయారు. ఎందుకంటే.. దీనిని స్పీక‌ర్‌తో ఆమోదించుకునే విష‌యంపై గంటా ఎలాంటి ప్ర‌య‌త్నం చేయ‌లేదు. పైగా ఫార్మాట్‌లో రాజీనా మా ఇవ్వ‌లేద‌ని స్పీక‌ర్ స్వ‌యంగా ప్ర‌క‌టించారు. దీంతో గంటా చేసిన రాజీనామాపై విశాఖ ఉక్కు ఉద్యోగుల వ‌ద్ద కూడా చ‌ర్చ సాగ‌డం లేదు. ఇదంతా రాజ‌కీయ వ్యూహంగానే కొట్టిపారేశారు.

సో.. ఇవ‌న్నీ గ‌మ‌నిస్తే.. అటు టీడీపీ.. ఇటు వైసీపీ కూడా గంటాను ప‌క్క‌న పెట్టాయి. పోనీ.. ప‌వ‌న్ పార్టీలోకి వెళ్లినా.. అస‌లు ఆ పార్టీ అధికారంలోకి వ‌చ్చే ప‌రిస్థితిపై అనేక సందేహాలు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో గంటా అనుచ‌రులు కూడా ఒక్కొక్క‌రుగా ఆయ‌న‌కు దూర‌మై.. ఇత‌ర పార్టీల్లోకి చేరిపోయారు. ఈ ప‌రిణామాల‌తో గంటా ఫ్యూచ‌ర్ కీల‌క స‌మ‌యంలో ఒడిదుడుకుల ప్ర‌మాదంగా మారింద‌నే కామెంట్లు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఆయ‌న ఇప్ప‌టికైనా పుంజుకునేందుకు  ప్ర‌య‌త్నిస్తారో లేదో చూడాలి.
Tags:    

Similar News