జర్ర ఫైవ్ స్టార్ రేటింగ్ ఇయ్యరాదె..నాకు పార్టీ టిక్కెటస్తది

Update: 2018-09-29 14:30 GMT
ఓలా క్యాబ్‌ లో ప్రయాణం చేసి దిగాక డ్రైవర్లు సార్! 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి అంటూ కోరడం అప్పుడప్పుడూ అందరికీ అనుభవమే. ప్రయాణికులు ఇచ్చే రేటింగ్ ఆధారంగా వారికి బుకింగ్‌ ల్లో ప్రయారిటీ ఇచ్చే విధానం ఆ సంస్థలో ఉంది. అందుకే చాలామంది డ్రైవర్లు ప్రయాణికులు రఫ్‌ గా ఉన్నా కూడా సంయమనంతో ఉండి మరీ మంచి రేటింగ్ సంపాదించుకోవాలనుకుంటారు. ఇప్పుడు తెలంగాణలో వివిధ పార్టీల్లో టిక్కెట్లు ఆశిస్తున్న నేతల పరిస్థితీ అలాగే ఉందట. పార్టీలో కార్యకర్తలను పెద్దగా పట్టించుకోని నేతలు కూడా ఇప్పుడు వారిని పలకరిస్తూ మంచిగా చూసుకుంటున్నారట.. కొందరైతే.. మొహమాటం లేకుండా పార్టీ నుంచి మీకు ఫోన్ వచ్చి నా గురించి అడిగితే మంచిగా చెప్పి 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి అంటూ అభ్యర్థిస్తున్నారట. పార్టీలన్నీ అంతర్గత సర్వేలు చేస్తూ అభ్యర్థులను ఖరారు చేసుకునే పనిలో ఉండడమే అందుకు కారణం.
   
 ముందస్తు ఎన్నికల్లో అధికార పీఠం కైవసం చేసుకునేందుకు టీఆర్‌ ఎస్ - మహా కూటమి నాయకులు ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ప్రత్యర్దులను మట్టి కరిపించేందుకు వ్యుహాలు సిద్ధం చేసుకున్నారు. అందులో భాగంగా టికెట్లు ఇస్తే విజయం సాధించే అభ్యర్దులను వెతికి పట్టుకునేందుకు సర్వేలు చేస్తున్నారు.  పార్టీలకు సేవలందించే నాయకునితో పాటు - స్దానిక ప్రజలకు అందుబాటులో ఉండే నేతను ఎంపిక చేసే పనిలో ఆయా పార్టీల పెద్దలు మునిగిపోయారు. ఇప్పటికే రెండుమూడు సర్వేలు చేసి అభ్యర్దుల జాబితా సిద్దం చేసుకుని వాటిపై ఫైనల్‌ గా ఎంపిక చేసేందుకు మరో విడత సర్వే చేపట్టారు. దీంతో ఈ చివరి అవకాశాన్ని ఎలాగైనా తాము వినియోగించుకోవాలని ఆశావహులంతా ప్రయత్నిస్తున్నారు.
   
టీఆర్‌ ఎస్ పార్టీ ఏడాదిన్నర కాలంలో 16సర్వేలు జరిపి ఊహించని విధంగా అసెంబ్లీ రద్దు చేయడంతో పాటు 105మంది అభ్య ర్దుల జాబితాను కూడా అదేరోజు విడుదల చేసింది. మరో 14మంది సీట్లను పెండింగ్‌ లో పెట్టింది. వాటిపై కూడా సర్వే చేసి త్వరలో అభ్యర్దులను ప్రకటిస్తామని గులాబీ బాసు ప్రకటన చేశారు. నేటికీ 20రోజుల గడిచినా ఇప్పటివరకు ఆ నియోజకవర్గాల అభ్యర్దుల ఎంపికలో మల్లగుల్లాలు పడుతుంది. మరో పక్క ప్రకటించిన జాబితాలో 15మంది అభ్యర్దులను మార్చే అవకాశం ఉందని ఆపార్టీ వర్గాలు గుసగుసలా డుతున్నారు.
   
ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో హైకమాండ్‌ తో నేరుగా పరిచయాలుంటే రాత్రికి రాత్రికి టికెట్ తెచ్చుకునే వీలు ఉండేంది. కానీ ఈఎన్నికల్లో పైరవీలకు తావులేకుండా గెలిచే వారికే సీట్లు ఇవ్వాలని యువనేత రాహుల్ చెప్పడంతో  సీనియర్ల పెత్తనానికి అడ్డుకట్టపడింది. ప్రతి నియోజకవర్గానికి ముగ్గురితో కూడిన జాబితా పంపించాలని పేర్కొనడంతో టిపిసిపి నాయకత్వం  రెండు దఫాలుగా సర్వే ఇచ్చిన ఇద్దరునుంచి ముగ్గురు అభ్యర్దుల లిస్టు రెండురోజుల కితం డిల్లీ పెద్దలకు అందజేశారు. వారు సర్వే నిర్వహించి దాని ఆధారంగా అభ్యర్దులు ప్రకటన ఉంటుందని చెప్పడంతో  ఆశావహాల గుండెళ్లో రైలు పరిగెడుతున్నాయి.  119 స్దానాల్లో ఇప్పటికి సర్వే చేసి కూటమిలో ఉండే మిత్రపక్షాలైన టిడిపికి 10 - టిజెఎస్‌ కు 3 - సిపిఐ 3 - ఉద్యమకారులకు 2సీట్ల ఇచ్చేందుకు ఆఫర్ పెట్టింది.దీనిపై కూటమి నాయకులు పెదవి విరుస్తున్నారు. సర్వే పేరుతో తమను చిన్నచూపు చూడవద్దని - హస్తం 80సీట్లు తీసుకుని మిత్రులకు 39 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
   
విపక్ష టిడిపి కూడా గతంలో పోటీ చేసిన  72స్దానాలపై ఆపార్టీ అధినేత ఏపి సిఎం చంద్రబాబు నాయుడు నిఘా వర్గాలతో సర్వే చేయిస్తున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన 15స్దానాలు  - రెండవస్దానంలో ఉన్న 20 నియోజకవర్గాలపై పూర్తి నివేదిక తెప్పించుకునే పనిలో పడ్డారు. సర్వేలో వచ్చిన ఫలితాల ఆధారంగా కూటమి ముందు రిపోర్టు ఉంచి సీట్లు కోరే చాన్స్ ఉంది. కాంగ్రెస్‌ కు ఇప్పటికే 20సీట్లకు సంబంధించిన అభ్యర్దుల జాబితాను అందజేశారు. ఈసీట్లు ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
   
కమలనాథులు బరిలో నిలిచే స్దానాలపై ఇప్పటికే ఆపార్టీ చీప్ అమిత్ షా ఆయన అనుచర వర్గంతో పార్టీ పరిస్దితి - నాయకుల బలబలాలు - ప్రత్యర్దులు పోకడలపై ఇప్పటికే రిపోర్టు తెప్పించుకున్నట్లు సమాచారం.
   

Tags:    

Similar News