తూర్పుగోదావరి జిల్లా తునిలో నిర్వహించిన కాపు గర్జన జరిగిన ఘటనలపై ఉపముఖ్యమంత్రులు, మంత్రులు స్పందించారు. ప్రభుత్వంపై కుట్ర రూపంలోనే ఈ ఘటన జరుగుతోందని ఆక్షేపించారు. వివిధ ప్రాంతాల్లో ఇద్దరు ఉపముఖ్యమంత్రులు సహా మంత్రులు స్పందించారు. ఈ క్రమంలో మంత్రులు ఆశ్చర్యకర స్టేట్‌మెంట్లు ఇచ్చారు.
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ కాపుల కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిని సహించలేకే వైసీపీ నేతలు హింసను ప్రేరేపించారని ఆరోపించారు. కాపులు సంయమనం పాటించి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. కాపు గర్జనకు ప్రభుత్వం ఎటువంటి ఆటంకం కలిగించలేదని అన్నారు. కాపు గర్జన హింసాత్మకంగా మారడం దురదృష్టకరమని, ఈ ఘటన వెనుక వైసీపీ హస్తం ఉండవచ్చని చెప్పారు.
మరో డిప్యూటీ సీఎం కేఈ.కృష్ణమూర్తి సైతం ఫైరయ్యారు. రాజకీయ సమస్యలు సృష్టించేందుకే ఆందోళనలు చేపడుతున్నారని విమర్శించారు. తుని ఘటనను చూస్తుంటే...ప్రజాదరణ లేని రాజకీయ నిరుద్యోగులే ఆందోళన చేస్తున్నంట్లుందని అన్నారు. ప్రజలకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బీసీల్లో చేర్చాలని చాలా కులాలు అడుగుతున్నాయని అన్నారు. కాపులను బీసీల్లో చేర్చడంపై కమిషన్ ఏర్పాటు చేశామని తెలిపారు.
కాపు గర్జన సందర్భంగా తునిలో జరిగిన హింసాకాండకు కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలదే బాధ్యత అని మంత్రి గంటా శ్రీనివాస్ అన్నారు. ఆకస్మిక నిర్ణయాలతో ప్రజలు ఇబ్బందులు పడతారని ఆయన చెప్పారు. రైల్ రోకో, రాస్తా రోకో వంటి ఆకస్మిక నిర్ణయాలు తీసుకోవడం సరైనది కాదని ఆయన అన్నారు.
తునిలో జరిగిన హింసాకాండ ఉదంతంలో జగన్ ప్రమేయం ఉందని మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉండటం ఇష్టం లేకనే జగన్ వెనకుండి కథ నడిపాడని అన్నారు. కాపు ఉద్యమాలు ఎప్పుడూ హింసాత్మకం కాలేదని చెప్పారు. ప్రభుత్వం అన్నీ గమనిస్తుందని, ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
తుని ఘటన దురదృష్టకరమని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. తల్లి, పిల్ల కాంగ్రెస్‌ల రాజకీయల కుట్రలో భాగమేనని అన్నారు. కాపులను జాతీయ స్థాయిలో అప్రతిష్టపాలు చేసేకుట్ర జరిగిందన్నారు. ఆందోళనకారులు ఇంత విధ్వంసం సృష్టించడం బాధాకరమన్నారు. మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ.. కాపు సంక్షేమానికి టీ డీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. రూ.100 కోట్లతో కాపు కార్పొరేషన్ ఏర్పాటుచేసిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. కాపులను బీసీల్లో చేర్చేందుకు కమిషన్ కూడా వేశామని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం వైసీపీ చేస్తున్న కుట్రలను కాపులందరూ గుర్తించాలని కోరారు.