దేశంలోనే అత్యంత ఎత్తులో పోలింగ్.. అద్భుతం

Update: 2019-04-11 11:08 GMT
దేశంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసి కేంద్ర ఎన్నికల సంఘం రికార్డ్ సృష్టించింది. లోక్ సభ ఎన్నికల వేళ ఈ అద్భుతం చోటుచేసుకుంది. కేవలం 180మంది ఓటర్ల కోసం ఈసీ ఈ సాహసం చేయడం విశేషం.

హిమాలయాల్లో ఉన్న సిక్కిం రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఎన్నికల అధికారులు అత్యంత ఎత్తైన ప్రాంతమైన తూర్పు సిక్కింలోని జ్ఞాతంగ్ మంచుకొండపై.. సముద్ర మట్టానికి 13500 అడుగుల ఎత్తులో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంచలనమైంది.

మచోంగ్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో జ్ఞాతంగ్ గ్రామం ఉంది. ఇది అత్యంత ఎత్తైన ప్రధేశం.. ఇక్కడి వాతావరణం గురించి తెలిసినా.. అత్యంత మంచుతో కప్పబడినా కూడా పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడం.. అధికారులు వెళ్లి 180మంది కోసం పోలింగ్ నిర్వహించడం విశేషం. దట్టంగా మంచుతో కప్పబడి ఉన్న ఈ ప్రాంతంలో పోలింగ్ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారట.. ఇక్కడ మరో 48 గంటలపాటు మంచు కురుస్తుందని .. వర్షం పడే చాన్స్ కూడా ఉందని వాతావరణ శాఖ తెలిపింది.


Tags:    

Similar News