ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్స్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. శుక్రవారం తొలి విడత పోలింగ్ జరగనున్న ప్రాంతంలో అంతా పోస్టల్ బ్యాలెట్స్ పోలింగ్ ప్రక్రియ మొదలైంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులంతా తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్స్ ద్వారా వినియోగించుకుంటున్నారు. టీచర్లు - ఇతర ప్రభుత్వ ఉద్యోగులు - అంగన్ వాడీ టీచర్లు పోస్టల్ బ్యాలెట్స్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
ప్రస్తుత రాజకీయంలో ప్రతి ఓటూ కీలకమే. అందుకే ఇప్పుడు రాజకీయ పార్టీలు కూడా పోస్టల్ బ్యాలెట్స్ మీద దృష్టి సారించాయి. అవి తమకే పడేలా చూసుకోవడానికి రాజకీయ పార్టీల నేతలు శతథా ప్రయత్నించారు. అందుకోసమని శుక్రవారం పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియ వద్ద నేతలు చాలా హడావుడే చేశారు.
అక్కడకు చేరుకుని ఉద్యోగులను ప్రలోభ పెట్టడానికి, ప్రచారం చేస్తూ వారిని ఆకట్టుకోవడానికి కూడా అభ్యర్థులు ప్రయత్నించడం గమనార్హం. ఈ వ్యవహారంలో కొందరు ఓవరాక్షన్ కూడా చేసిన దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి.
ఇక కేవలం అభ్యర్థులు మాత్రమే కాకుండా.. అనేక మంది నేతలు కూడా అక్కడకు చేరిపోయి హడావుడి చేశారు. తమకే ఓటు వేయాలని ఒత్తిళ్లు చేశారు. దీంతో ఆ పోలింగ్ కేంద్రాల వద్ద గొడవలు చెలరేగాయి. పోలీసులు,భద్రతా దళాలు రంగంలోకి దిగి.. అక్కడ పరిస్థితి సద్దుమణిగేలా చేశారు. శుక్రవారమే పోస్టల్ బ్యాలెట్స్ విషయంలో ఆసక్తిదాయకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఈ పద్ధతిలో ఓటు హక్కును వినియోగించుకుంటున్న నేపథ్యంలో, పోలింగ్ రోజున ముందుగా కౌంటింగ్ జరిగేది పోస్టల్ బ్యాలెట్సే కాబట్టి.. ఈ వ్యవహారం ఆసక్తిదాయకంగా నిలుస్తూ ఉంది.