పండగ సెలవులు మామూలే. వేసవి సెలవులు అలవాటే. కానీ.. కాలుష్యం సెలవులు ఏమిటని అనుకుంటున్నారా? వాయు కాలుష్యం మీద డిల్లీ సర్కారు యుద్ధం స్టార్ట్ చేసిన నేపథ్యంలో.. పిల్లలకు ఓ రెండు వారాలు సెలవులు ఇవ్వాలని డిసైడ్ చేసింది. ఢిల్లీలో ప్రమాదకరంగా మారిన వాయుకాలుష్యానికి చెక్ చెప్పేందుకు వీలుగా.. వినూత్న ప్రయత్నాలతో ముందుకెళుతోంది కేజ్రీవాల్ సర్కారు. ఇందులో భాగంగా చైనాలోని బీజింగ్ నగరంలో విజయవంతంగా అమలు చేస్తున్న సరి.. బేసి వాహనాల విధానాన్ని జనవరి ఒకటోతేదీ నుంచి స్టార్ట్ చేయాలని ఢిల్లీ రాష్ట్ర సర్కారు భావిస్తున్న సంగతి తెలిసిందే.
వాహనం చివరన సరి సంఖ్యలో ఉండే వాహనాలు ఒక రోజు.. తర్వాతి రోజు బేసి సంఖ్య ఉండే వాహనాలను మాత్రమే రోడ్ల మీదకు అనుమతించాలని.. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి మొదలుకొని మంత్రులతో సహా అందరూ ఈ నిబంధనల పరిధిలోకి రావాలని డిసైడ్ చేశారు. ఈ నిర్ణయం కాని అమలు జరిగితే.. జనవరి 1 నుంచి దాదాపుగా రోజువారీగా రోడ్ల మీదకు వచ్చే వాహనాల్లో 50 శాతం రావు.
మరింత పెద్ద స్థాయిలో వాహనాలు రోడ్ల మీదకు రాని పక్షంలో రవాణా సౌకర్యం ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉంది. అందుకే.. దీనికి బదులుగా 6వేల ప్రైవేటు వాహనాల్ని అదనంగా రోడ్ల మీదకు తీసుకురావాలని భావిస్తున్నారు. వీటిలో 2వేల స్కూల్ బస్సులున్నాయి. స్కూలు బస్సుల్ని ప్రజారవాణా కోసం వినియోగించాలంటే.. స్కూలు విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదు. అందుకే.. స్కూలు విద్యార్తులకు 15 రోజుల పాటు సెలవులు ఇవ్వాలని భావిస్తున్నారు. ఇందుకోసం విద్యా సంస్థల యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చలు జరపాలని భావిస్తోంది.ఈ నిర్ణయం కానీ అమలైన పక్షంలో.. ఢిల్లీలోని 28 లక్షల మంది విద్యార్థులకు రెండు వారాలు పొలుష్యన్ సెలవులు వచ్చినట్లే.