వేదిక ఏదైనా తనకు నచ్చిన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచే అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి ఘాటు రిప్లై వచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు పోరాట పటిమను పెంచుకోవాలని, ప్రభుత్వంపై ఉద్యమించాలని, ఆశించిన రీతిలో పనిచేయడం లేదని అర్థం వచ్చే విధంగా జేసీ వ్యాఖ్యలు చేయడం పట్ల కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి అసంతృప్తి వ్యక్తం చేశారు. జేసీ దివాకర్ రెడ్డి సూచనలు - సర్టిఫికేట్ తమకు అవసరం లేదన్నారు. దివాకర్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదని - ఆయనేమైనా పెద్ద తోపా అని పొంగులేటి ఎద్దేవా చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ నేతలకు సూచనలు ఇచ్చే అధికారం జేసీకి లేదని పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో ఉండి అధికార పార్టీతో పోరాటం చేయడం చేతకాక పారిపోయి టీడీపీలో చేరిన జేసీ తమకు సర్టిఫికేట్ ఇవ్వడం ఏమిటని పొంగులేటి ఎద్దేవా చేశారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు టీ తాగమని కోరితే, తాను తెలంగాణ చాయ్ తాగనని, ఆంధ్రా చాయ్ మాత్రమే తాగుతానని జేసీ అనడం తగదన్నారు. తమ పార్టీ కార్యాలయానికి జేసీ వచ్చారని, అతనిని అతిథిగా ఆహ్వానించి టీ తాగమని అడిగితే ఆంధ్రా చాయ్ మాత్రమే తాగుతానని చెప్పడం బాగాలేదని పొంగులేటి అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ గురించి మాట్లాడడం అందరికీ ఫ్యాషన్ గా మారిందన్నారు. కాంగ్రెస్కు మంచి భవిష్యత్తు ఉందని పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/