తెలంగాణ కాంగ్రెస్ లో ముసలం మొదలైంది. పీసీసీ పదవుల పంపకంపై పొంగులేటి అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. కో ఆర్డినేషన్ కమిటీ - ఎగ్జిక్యూటీవ్ కమిటీ పదువులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఆయన సోనియాగాంధీ - రాహుల్ గాంధీకి లేఖ రాశారు. టీ పీసీసీ పదవుల పంపిణీ సక్రమంగా జరగలేదని, సీనియర్లను విస్మరించి కొందరి మాటకే విలువనిస్తున్నారని వాపోయారు. దీంతో రంగంలోకి దిగిన ఉత్తమ్ కుమార్ రెడ్డి - షబ్బీర్ అలీ.. పొంగులేటితో చర్చలు జరిపారు. పదవులు రాని వారికి ప్రాధాన్యమిస్తామని హామీనిచ్చారు.
పదవుల కేటాయింపులో పార్టీ రాష్ట్ర నాయకత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ ఆ పార్టీ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి పార్టీ పదవులకు రాజీనామా చేయడం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది. పార్టీలో సీనియర్లను పక్కనబెడుతున్న రాష్ట్ర నాయకత్వం... తమకు అనుకూలంగా ఉన్నవారి మాటకే ప్రాధాన్యమిస్తూ జూనియర్లను అందలమెక్కించిందని పొంగులేటి ఆరోపించడమే కాకుండా ఏకంగా సోనియాగాంధీకి లేఖ రాశారు. దీంతో టీపీసీసీ నేతలు కంగారుపడి ఆయన్ను బుజ్జగించే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
అయితే... పొంగులేటి చాలాకాలంగా టీఆరెస్ లోకి వెళ్లాలని అనుకుంటున్నారని.. సరైన సమయం కోసం చూస్తున్న ఆయన ఈ అసంతృప్తిని చూపిస్తూ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పాలనుకుంటున్నారన్న వాదన ఒకటి వినిపిస్తోంది.