అందరినీ ఓ రౌండ్‌ వేసుకున్న పోసాని

Update: 2019-04-08 06:20 GMT
 పోసాని కృష్ణమురళి. సినిమా ఇండస్ట్రీలో అయినా రాజకీయాల్లో అయినా ఏమాత్రం పరిచయం అవసరం లేని పేరు. ముక్కుసూటిగా మాట్లాడే తత్వం పోసాని సొంతం. తప్పు ఎవరు చేసినా ప్రశ్నిస్తాడు. అదే సమయంలో.. తప్పు చేసిన వారిని అస్సలు వదలడు.  మంచి అయినా, చెడు అయినా సూటిగా సుత్తిలేకుండా చెప్తాడు.

 ఎన్నికల వేళ అందరూ కలిసి జగన్‌పై చేస్తున్న కుట్రలకు పోసాని కోపం వచ్చింది. అంతే ప్రెస్‌ మీట్‌ పెట్టి మరీ అందర్నీ ఏకిపారేశాడు. పోసాని మాట్లాడుతూ.. “శివాజీ ఊసరవెల్లిలా ఎలా మారతాడో ఆంధ్రా ప్రజలకు తెలియ చేయడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశా. శివాజీ సడన్ గా వచ్చి ఎదో ఒకటి మాట్లాడి వెళ్లి పోతారు. చంద్రబాబు పాలనలో అవినీతి ఉందని చెప్పిన శివాజీకి చంద్రబాబు ఇప్పుడెలా దేవుడు అయ్యారో నాకు అర్థం కావడం లేదు. ఆపరేషన్ గరుడను శివాజీ, చంద్రబాబు ఇద్దరు కలిసి సృష్టించారు. చంద్రబాబు ఆదేశాలతోనే శివాజీ గరుడ పురాణం అంటూ కబుర్లు చెప్తున్నారు. ఇలాంటి వారి మాటలు నమ్మకండి. చంద్రబాబు ఎలాంటి వాడు - జగన్ ఎలాంటి వాడో చూసి ఓట్లు వేయమని ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. కాంగ్రెస్ నుండి టీడీపీ లో చేరి ఎన్టీఆర్ నుండి పార్టీని చంద్రబాబు లాక్కున్నారు చంద్రబాబు. జగన్ కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చి సొంతంగా వైసీపీని స్థాపించారు. చంద్రబాబు తెలంగాణ ఉద్యమంలో రెండు మాటలు మాట్లాడితే జగన్ సమైక్యాంధ్ర కు కట్టుబడి వున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజి కావాలని అన్నారు, కానీ జగన్ మొదటి నుండి ఏపీకి ప్రత్యేక హోదాకు కట్టుబడి వున్నారు. కేసీఆర్ తో ఎన్నికల పొత్తుకు చంద్రబాబు ప్రయత్నించలేదా.? దేశంలో చంద్రబాబు పొత్తు పెట్టుకొని పార్టీ లేదు - నాయకుడు లేడు. లక్ష్మీ పార్వతి పై కక్షతో కేసులు పెట్టించి అప్రదిష్ట పాలుచేయాలని చూస్తున్నా. జయప్రద - రోజా - కవితలను పార్టీలో చేర్చుకుని.. వారి సేవలను వినియోగించుకుని.. పార్టీ నుండి బయటకు పంపించారు. జగన్ మంచి వాడు కాదని పవన్ కళ్యాణ్ నిరూపిస్తే నేను పవన్ కళ్యాణ్ ని సమర్థిస్తా. అధికారంలో ఉన్న చంద్రబాబును విమర్శించకుండా పవన్ కళ్యాణ్ జగన్ ను విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు కుమ్మక్కు అయ్యి జగన్ పై కేసులు పెట్టించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ను గెలిపించండి. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక తప్పు చేస్తే నేను ప్రశ్నిస్తా” అని అన్నారు పోసాని.





Tags:    

Similar News