ప‌వ‌న్ క‌ల్యాణ్ పై కేసులు త‌ప్ప‌వా!

Update: 2020-01-02 11:30 GMT
రాజ‌ధాని ప్రాంతంలో గ‌త మంగ‌ళ‌వారం ప‌ర్య‌టించి హ‌ల్చ‌ల్ చేసిన జ‌న‌సేన అధిప‌తి ప‌వ‌న్ క‌ల్యాణ్ పై కేసులు త‌ప్ప‌వ‌ని తెలుస్తోంది. పోలీసులు పెట్టిన నిబంధ‌ల‌ను ఉల్లంఘించినందుకు గానూ ప‌వ‌న్ క‌ల్యాణ్ కేసుల‌ను ఎదుర్కొనాల్సి ఉంటుంద‌ని స‌మాచారం. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫ‌ర్ ఆల్ కింద‌.. ఈ రాజ‌కీయ పార్టీ అధినేత మీద కేసులు న‌మోదు కాబోతున్నాయ‌ని స‌మాచారం. ఇప్ప‌టికే పోలీసులు న్యాయ స‌ల‌హాను కోరిన‌ట్టుగా తెలుస్తోంది.

రాజ‌ధాని ప్రాంతంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ రైతుల‌ను ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. అక్క‌డ మంగ‌ళ‌వారం రోజున పోలీసులు 144 సెక్ష‌న్ ను విధించారు. గ‌త కొన్నాళ్లుగా ఆ ప్రాంతంలో ధ‌ర్నాలు, దీక్ష‌ల నేప‌థ్యంలో ఆ సెక్ష‌న్ అమ‌ల్లో ఉన్న‌ట్టుగా పోలీసులు చెబుతున్నారు. అలాగే ఆ స‌మ‌యంలో భారీ ఎత్తున ర్యాలీల‌కు, ప్ర‌జ‌లు గుమిగూడి ఉండ‌టం మీద కూడా నిషేధం ఉంది.

అయితే ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆ నిషేధాజ్ఞల‌ను ఉల్లంఘించారు. ఆయ‌న నేతృత్వంలో జ‌న‌సేన పార్టీ వ్య‌క్తులు చాలా మంది వ‌చ్చారు. 144 తో పాటు ఇత‌ర సెక్ష‌న్ల నియ‌మాల‌ను కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆధ్వ‌ర్యంలో ఉల్లంఘ‌న‌లు జ‌రిగాయి.

అలాగే సీఎం వెళ్లాల్సిన రోడ్డు గురించి చెప్పి.. మ‌రో మార్గంలో రైతుల ద‌గ్గ‌ర‌కు వెళ్లాల‌ని తాము సూచించినా ప‌వ‌న్ విన‌లేద‌ని, దీంతో అడ్డంగా ముళ్ల కంచె వేయాల్సి వ‌చ్చింద‌ని పోలీసులు చెబుతున్నారు. అయినా విన‌కుండా ప‌వ‌న్  బైఠాయించార‌ని.. వీటి మీద కేసులు న‌మోదు చేయ‌డానికి అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. న్యాయ స‌ల‌హా వ‌చ్చాకా పోలీసులు ప‌వ‌న్ మీద కేసుల విష‌యంలో నిర్ణ‌యం తీసుకుంటార‌ని తెలుస్తోంది.


Tags:    

Similar News