భారత్ లో 4 రోజులుగా పెరిగిపోతోన్న పాజిటివ్ కేసులు...కొత్తగా ఎన్నంటే ?

Update: 2021-07-31 08:30 GMT
ఇండియాలో కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ జోరు కొనసాగుతుంది. సెకండ్ వేవ్ దేశంలో ఓ దశలో పీక్స్ కి చేరినా ఆ తర్వాత తగ్గుముఖం పట్టాయి. అయితే , మళ్లీ గత నాలుగు రోజులుగా దేశంలో కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 41,649 కొవిడ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. మరో 37,291 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మహమ్మారి బారినపడి మరో 593 మంది బాధితులు కన్నుమూశారు. ప్రస్తుతం దేశంలో 4,08,920 యాక్టివ్‌ కేసులున్నాయని మంత్రిత్వశాఖ పేర్కొంది.

తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,16,13,993కు పెరిగింది.  ఇందులో 3,07,81,263 మంది కోలుకున్నారు. వైరస్‌ బారినపడి 4,23,810 మంది మృతి చెందారు. దేశంలో మరణాల రేటు 1.3 శాతంగా ఉంది. ప్రపంచ దేశాల్లో ఇది 2.13 శాతంగా ఉంది. రికవరీ రేటు 97.4 శాతంగా ఉంది. టీకా డ్రైవ్‌ లో భాగంగా 46,15,18,479 డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ వివరించింది.దేశవ్యాప్తంగా కొత్తగా 17,76,315 టెస్టులు చేశారు. భారత్‌ లో ఇప్పటివరకు 46 కోట్ల 64 లక్షల 27వేల 038 టెస్టులు చేశారు. వరుసగా 4వ రోజు యాక్టివ్ కేసులు పెరిగాయి. కొత్త కేసులు వరుసగా నాలుగో రోజు 40వేలకు పైగా వచ్చాయి. వారపు సగటు చూస్తే, గత 17 రోజుల్లో 40వేలు దాటింది ఇప్పుడే. నిన్న దేశంలోనే అత్యధికంగా కేరళలో 20.77 వేల కొత్త కేసులు వచ్చాయి.

ఏపీలో కొత్తగా 80,641 టెస్టులు చెయ్యగా, కొత్తగా 2,068 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 19,64,117కి చేరింది. కొత్తగా 22 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 13,354కి చేరింది. కొత్తగా 2,127 మంది కోలుకున్నారు. అలాగే దేశంలో  మొత్తం రికవరీల సంఖ్య 19,29,565కి చేరింది. ప్రస్తుతం 21,198 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,44,84,051 టెస్టులు జరిగాయి.  తెలంగాణ లో కొత్తగా 614 కేసులు వచ్చాయి. మొత్తం కేసులు 6,44,330కి చేరాయి. కొత్తగా 657 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 6,31,389కి చేరింది. రికవరీ రేటు 97.99 శాతంగా ఉంది. రాష్ట్రంలో కొత్తగా నలుగురు మరణించారు. మొత్తం మరణాలు 3,800కి చేరాయి. మరణాల రేటు 0.58 శాతం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,141 యాక్టివ్ కేసులున్నాయి.

ప్రపంచదేశాల్లో కొత్తగా 6,26,206 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 19.79 కోట్లు దాటింది. కొత్తగా 9,049 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 42.23 లక్షలు దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1.48 కోట్లు ఉన్నాయి. ఇవి క్రమంగా పెరుగుతున్నాయి. అమెరికాలో కొత్తగా 88,997 కేసులు, 401 మరణాలు వచ్చాయి. బ్రెజిల్‌ లో నిన్న 40,499 కొత్త కేసులు, 834 మరణాలు సంభవించాయి. నిన్న రోజువారీ ఎక్కువ కేసులు అమెరికాలో వచ్చాయి. ఆ తర్వాత ఇండియా, ఇండొనేసియా , బ్రెజిల్, బ్రిటన్ లో వచ్చాయి. నిన్న రోజువారీ మరణాలు ఇండొనేసియా  లో ఎక్కువగా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి.
Tags:    

Similar News