భారత్ ‌లో 2 లక్షలు దాటిన వైరస్ కేసులు

Update: 2020-06-03 05:44 GMT
భారత్‌ లో వైరస్ పాజిటివ్  కేసులు రెండు లక్షలు దాటాయి. కేవలం 15 రోజుల్లోనే పాజిటివ్ కేసులు లక్ష నుంచి రెండు లక్షలకు చేరుకోవడం ఆందోళన కలిగించే అంశం. గత మూడు రోజులుగా 8 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం ఉదయం వరకు కొత్తగా 8171 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 2 లక్షలు దాటింది. కరోనాతో గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 204 మంది మరణించారు. దీంతో దేశంలో ఇప్పటివరకు వైరస్ తో మరణించిన వారి సంఖ్య 5598కి చేరుకుంది.

అయితే కేవలం 15 రోజుల్లోనే దేశంలో వైరస్ కేసుల సంఖ్య రెట్టింపు కావడం ఆందోళన కలిగిస్తుండగా.. రికవరీ రేటు 48.07 శాతం ఉండటం కాస్త ఊరట కలిగిస్తోంది. మరోవైపు దేశంలో కరోనా మరణాల రేటు 2.82 శాతంగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్‌, తమిళనాడులలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. మహారాష్ట్రలో ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య 70 వేల దాటింది.

ఇకపోతే , ప్రపంచంలో వైరస్ కేసులు అధికంగా నమోదవుతున్న దేశాల్లో భారత్ ఏడో స్థానంలో ఉంది. 18 లక్షలకు పైగా కేసులతో అమెరికా తొలి స్థానంలో ఉండగా.. 5.2 లక్షల కేసులతో బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. సుమారు 4 లక్షల కేసులతో రష్యా మూడో స్థానంలో ఉంది.  2.33 లక్షల కేసులతో ఆరో స్థానంలో ఉన్న ఇటలీని భారత్ ఐదారు రోజుల్లో అధిగమించే అవకాశం ఉంది. భారత్‌లో నమోదవుతున్న వైరస్ కేసులతో పోలిస్తే.. 14కు పైగా దేశాల్లో నమోదవుతున్న కేసులు 55 రెట్లు అధికంగా ఉన్నాయని ఓ అంచనా.
Tags:    

Similar News