సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఒకే కుటుంబంలో 19 మందికి వైరస్ పాజిటివ్ గా నిర్దారణ కావడంతో కలకలం రేపుతోంది. వీరందరికి వైరస్ కారణంగా చనిపోయిన మహిళ అంత్యక్రియల్లో పాల్గొనడం ద్వారా వైరస్ సోకినట్టు తేలింది. జహీరాబాద్ కు చెందిన ఓ55 ఏళ్ల మహిళ అనారోగ్య కారణాలతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. ఈనెల 9న కరోనా అనుమానిత లక్షణాలతో చని పోయింది.
దీంతో వైద్యులు ఆమె నుంచి శాంపిల్స్ సేకరించారు. అయితే , ఆ రిపోర్ట్స్ వచ్చేలోపే ఆ మహిళకు స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. శాంపిల్స్ లో ఆ మహిళకు వైరస్ సోకినట్టు తేలింది. దీనితో చనిపోయిన మహిళకు సన్నిహితం గా తిరిగిన కుటుంబ సభ్యులు, బంధువులను గుర్తించి మిర్జాపూర్ (బి) లోని ఐసోలేషన్ కేంద్రానికి తీసుకెళ్లి 25 మంది శాంపిల్స్ సేకరించగా ..వారిలో 19 మందికి వైరస్ సోకినట్టుగా తేలింది. దీంతో షాక్ అయిన అధికారులు వారందరినీ సంగారెడ్డిలో జిల్లా ఆస్పత్రికి తరలించనున్నారు. సోకిన వారిలో పెద్దవారితో పాటు చిన్నపిల్లలు, మహిళలు ఉన్నారు. ఇదిలావుంటే.. అంత్యక్రియల్లో పాల్గొన్న దాదాపు 40 మందినీ గుర్తించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. దీనితో ఆ ప్రాంతనంతా కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు