విద్యుత్ కోతలు తెలుగు ప్రజలకు కొత్తేం కాదు. కాకుంటే.. రాష్ట్ర విభజనకు ముందు వరకు వేసవి వచ్చిందంటే చాలు.. ఎన్ని గంటలు విద్యుత్ కోతలు ఉంటాయన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరగటమే కాదు.. దానికి తగ్గట్లుగా ప్రజల పనులు ఉండేవి. వేసవిలో తీవ్రంగా ఉండే కోతల నేపథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడేవారు. 2014 నుంచి విద్యుత్ కోతలు క్రమంగా తగ్గుముఖం పట్టటమే కాదు.. 2015 నుంచి కోతలే లేని రీతిలో పరిస్థితి మారింది. కట్ చేస్తే.. మళ్లీ ఇన్నాళ్లకు ఏపీలో విద్యుత్ కోతలు రాష్ట్ర ప్రజలకు చుక్కలు చూపిస్తోంది.
పగలు.. రాత్రి అన్న తేడా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు.. ముందస్తు సమాచారం ఇవ్వకుండా గంటల కొద్ది సమయం కోతలకే సరిపెడుతున్న అధికారుల తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ సమస్య ఉంటే.. ఏపీకి చుట్టుపక్కల రాష్ట్రాలకు ఉండాలి. అటు తెలంగాణకు కానీ.. ఏపీకి అనుకొని ఉండే తమిళనాడు కానీ.. మరో బుల్లి రాష్ట్రమైన పుదుచ్చేరికి కాని లేని ఇబ్బంది ఏపీకే ఎందుకు వస్తోందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
తెలంగాణలో ప్రస్తుతం 250-260 మిలియన్ యూనిట్ల మధ్య ఉన్నా.. అందుకు సరిపడా విద్యుత్ ను ఎలాంటి సమస్యా లేకుండా సరఫరా చేస్తున్నప్పుడు.. ఏపీ విషయంలో అలా ఎందుకు జరగటం లేదు? అన్నది ప్రశ్నగా మారింది. అంతేకాదు.. తమిళనాడు.. చిన్న రాష్ట్రమైన పుదుచ్చేరిలోనూ కోతలు లేని పరిస్థితి. ఇంతకూ అసలు లోపం ఎక్కడ ఉంది? అన్న విషయాన్ని చూస్తే.. ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవటమే ఈ సమస్య మొత్తానికి కారణంగా చెబుతున్నారు.
ఇదే.. ఈ రోజున ఏపీ ప్రజలు చీకట్లో మగ్గేలా చేస్తుందన్న మాట వినిపిస్తోంది. దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల విద్యుత్ డిమాండ్ సుమారు 1221 మిలియన్ యూనిట్లుగా చెబుతారు. అందులో 28.71 మిలియన్ యూనిట్ల లోటు ఉంటే.. ఏపీ ఒక్క దాని లోటే 23.53 మిలియన్ యూనిట్లు కావటం గమనార్హం. అంటే.. లోటు ఉన్నప్పటికి మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే సింహ భాగం ఏపీకే ఉండటాన్ని చూస్తే.. ఇతర రాష్ట్రాల మాదిరి ఏపీ ప్రభుత్వం.. అధికారులు జాగ్రత్తలు తీసుకోకపోవటమే మొత్తం సమస్యకు కారణంగా చెబుతున్నారు. మిగిలిన రాష్ట్రాల విద్యుత్ సంస్థలు ముందస్తుగా పరిస్థితిని అంచనా వేసి.. అవసరమైన విద్యుత్ ను సమకూర్చుకుంటే.. ఏపీ అధికారులు మాత్రం అవేమీ పట్టనట్లు వ్యవహరించటంతో కోట్లాది మంది ప్రజలు చీకట్లో మగ్గుతూ.. చెమటలు కక్కుతూ నరకం అనుభవిస్తున్నట్లు చెబుతున్నారు.
మరింత దారుణమైన అంశం ఏమంటే.. విద్యుత్ ఉత్పత్తి అసలే లేని బుల్లి రాష్ట్రంగా పుదుచ్చేరి ఉంది. ఆ రాష్ట్ర డిమాండ్ 9.32 మిలియన్ యూనిట్లు. అంటే.. అక్కడ ఖర్చు చేసే ప్రతి యూనిట్ ను బయట రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయాల్సిందే. అలాంటి రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు లేకుండా..కోతల్లేని పరిస్థితి ఉంటే.. ఏపీలో డిమాండ్ 235 మిలియన్ యూనిట్లు అయితే.. థర్మల్.. జల.. ఇతర వనరుల నుంచి వచ్చే విద్యుత్ ఏకంగా 130 మిలియన్ యూనిట్లు.
అంటే.. మరో వంద మిలియన్ యూనిట్లను సమకూర్చుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవు. కానీ.. ఆ లోటును పూడ్చుకునే విషయంలో మిగిలిన రాష్ట్రాలకు భిన్నంగా వ్యవహరించిన తీరు.. ఒప్పందాలు చేసుకోవటంలో దొర్లిన ఆలస్యం.. ముందుచూపు లేకపోవటం ఏపీ ప్రజలకు ఈ వేసవి నరకాన్ని తలపించేలా మారిందని చెప్పక తప్పదు.