పీపీఈ కిట్స్.. కరోనా వైరస్ సోకకుండా వైద్యులు, సిబ్బంది, రోగులు ఒకసారి వాడిన ఈ కిట్స్ ను మరోసారి వాడరు. దాంతోనే డ్యూటీ మొత్తం చేసి వైద్యులు ఆ తరువాత తీసివేసి ప్యాక్ చేసి బయట పడేస్తారు.
తెలంగాణలో కరోనాకు కేంద్రమైన గాంధీ ఆస్పత్రి ఆవరణలో గుట్టల్లా పీపీఈ కిట్స్ పేరుకుపోతున్నాయి. వాటి నుంచి వచ్చే దుర్వాసనతో వైద్యులు, రోగులు, సిబ్బంది , సమీప కాలనీవాసులు విలవిల్లాడుతున్నారు.కొందరు ఇళ్లు ఖాళీ చేసి కూడా వెళ్లిపోతున్నారు.
గాంధీలో రోగులు, వైద్యులు, నర్సులు, వార్డ్ బాయ్ లు ఉపయోగించిన కిట్లు రోజుకు 2వేలకు పైగానే ఉంటున్నాయి. నెలకు 60వేల కిట్లు చెత్తకుండీలో వేయాలి. కానీ ఆవరణలో ఉన్న ఒక చిన్న రేకుల గది వద్ద వీటిని ఉంచుతున్నారు.వాడిపడేసిన పీపీఈ కిట్స్ ను రాంకీ సంస్థ సిబ్బంది ఏరోజుకారోజు తీసివేయాల్సి ఉన్నా నెలరోజులుగా వాటిని పట్టించుకోకపోవడంతో ఆస్పత్రిక సిబ్బంది దుర్వాసనతో నరకం చూస్తున్నారు. ఆస్పత్రి నిర్వాహకులు పట్టించుకోకపోవడంతో పీపీఈ కిట్స్ కుప్పగా మారి దుర్వాసనతో కంపు కొడుతోంది.