భారత చలన చిత్ర రికార్డుల్ని సరి చేయటమే కాదు.. తెలుగు చలనచిత్ర పరిశ్రమ రేంజ్ ను అంతర్జాతీయ ఖ్యాతి కల్పించిన చిత్రంగా బాహుబలిని చెప్పాలి. గత కొన్ని వారాలుగా బాహుబలి మేనియా దేశాన్ని ఆవహించింది. ఒక సినిమాతో తెలుగు సినిమా ఎక్కడికో వెళ్లిపోయిన పరిస్థితి.
తాజాగా బాహుబలి దేశ ప్రధాని మోడీని కలిశారు. ఈ సందర్భంగా హీరో ప్రభాస్ ని ఉద్దేశించి మోడీ మాట్లాడుతూ.. బాహుబలి చిత్రం దేశానికే గర్వకారణమని చెప్పటమే కాదు.. బాహుబలి గురించి తాను విన్నానని.. దేశానికి గర్వకారణంగా నిలిచిందని వ్యాఖ్యానించారు.
నిత్యం అప్ డేట్ గా ఉండే మోడీ.. బాహుబలి గురించి కూడా ఇంత అప్ డేట్డ్ గా ఉన్నారా? అని ఆశ్చర్యం కలిగించేలా సినిమా గురించి మాట్లాడటం.. హీరో ప్రభాస్.. బీజేపీ నేత.. ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు ఆయన సతీమణి.. మిగిలిన వారంతా మోడీ మాటలతో ఆనందంతో ఉక్కిరిబిక్కరి అయ్యారు. తనకు సమయం సరిపోవటం లేదని.. ఏ మాత్రం వీలు కుదిరినా సినిమాను చూస్తానంటూ ప్రభాస్ కు మోడీ హామీ ఇచ్చారు. అనంతరం.. బాహుబలిని కలిశా అంటూ మోడీ తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.
ప్రదానిని కలిసిన సందర్భంగా ప్రభాస్.. మోడీకి పాదాభివందనం చేసిన ఆయన.. తానూ మోడీ అభిమానిని అని చెప్పినప్పుడు.. అప్యాయంగా ప్రభాస్ భుజం తట్టినట్లుగా చెబుతున్నారు.
ఇక.. బాహుబలి హడావుడి ఈ ఆదివారం దేశ రాజధానిలో చేసింది. ఈ సినిమాను పలువురు ప్రముఖులు ప్రత్యేకంగా వీక్షించారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్.. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. కేంద్ర మంత్రులు రాజ్యవర్ధన్ తదితర ప్రముఖులు ఈ సినిమా చూశారు.
ఎప్పడూ లేనిది ఈసారి తన సినిమాను జాతీయ స్థాయి నేతలతో కలిసి చూడటంతో ప్రభాస్ సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారని చెబుతున్నారు.