ప్రకాష్ రాజ్. సినీ జనాలకు పరిచయం చేయనక్కరలేని పారు. ఆయన బహుముఖీయమైన ప్రతిభాపాటవాలు ఉన్న నటుడు. ఆయన భారతీయ నటుడు. అనేక భాషలలో నటించిన అనుభవం ఆయన సొంతం. వెండి తెర మీద ఎంత మంచి నటుడో బయట రాజకీయ సామాజికపరమైన ఆసక్తి ఉన్న మనిషిగా ఆయన్ని చూస్తారు. ముఖ్యంగా మేధావి రాజకీయ నేతగా ఆయన తనను తాను ఇటీవల కాలంలో పరిచయం చేసుకున్నారు.
ఆయన 2019 ఎన్నికల్లో బెంగుళూరు సెంట్రల్ నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడారు. ఆయన బీజేపీ వ్యతిరేక భావజాలం నిండా నింపుకున్న నాయకుడు. వామపక్ష భావాలు ఆయనలో ఎక్కువగా కనిపిస్తాయి. ఆయన ఇపుడు కేసీయార్ తో చేతులు కలిపారు. బీయారెస్ జాతీయ పార్టీగా ఆవిర్భవించిన వేళ పార్టీ పేరు జెండా ఆవిష్కరించిన శుభ వేళ కేసీయార్ పక్కనే ప్రకాష్ రాజ్ కూడా ఉన్నారు.
ఆయన అందరితో కలసిమెలసి తిరుగుతూ సందడి చేయడం ఆకట్టుకుంది. దీన్ని బట్టి చూసిన వారు అంతా బీయారెస్ లో జాతీయ ఫేస్ గా ప్రకాష్ రాజ్ కనిపిస్తారు అని అంటున్నారు. ఆయన్ని కేసీయార్ ఆ విధంగా సమర్ధంగా వాడుకుంటారు అని కూడా అంచనా కడుతున్నారు. ప్రకాష్ రాజ్ కన్నడీగుడు. ఆయన నటుడిగా కన్నడంతో పాటు తమిళం, తెలుగులో కూడా సత్తా చాటారు.
దాంతో కేసీయార్ జాతీయ పార్టీ భారతీయ రాష్ట్ర సమితికి కన్నడ, తమిళనాడు బాధ్యతలు ప్రకాష్ రాజ్ కి అప్పగిస్తారు అని అంటున్నారు. ఆయనకు కన్నడ రాష్ట్రంలో విస్తృతమైన పరిచయాలు ఉన్నాయి. దాంతో పాటు తమిళనాడులో కూడా ఆయనకు పలుబడి ఉంది. అనేక భాషలు రావడం చేత ఉత్తరాదిన కూడా ఆయన సేవలను పార్టీ కోసం ఉపయోగించుకోవచ్చు అని కేసీయార్ ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.
ఇక చూస్తే వచ్చే ఏడాది కర్నాటకలో శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి. దాంతో కర్నాటక బీయారెస్ చీఫ్ గా ప్రకాష్ రాజ్ ని నియమిస్తారు అని అంటున్నారు. అలాగే కన్నడ నాట బీయారెస్ జేడీఎస్ కలసి పోటీ చేస్తాయని చెబుతున్నారు. కర్నాటకలో బీయారెస్ ముఖ్యామంత్రి అభ్యర్ధిగా కూడా ప్రకాష్ రాజ్ పేరు ప్రకటిస్తారు అని ఆ విధంగా ఆ రాష్ట్రంలో ఎన్నికలను ఎదుర్కొంటారని అంటున్నారు.
ఇక చాలా కాలంగా కేసీయార్ తో ప్రకాష్ రాజ్ కలసి ప్రయాణం చేస్తున్నారు. ఆ మధ్య మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేని కలవడానికి ముంబై వెళ్ళినపుడు కేసీయార్ వెంట ప్రకాష్ రాజ్ ఉన్నారు. అదే టూర్ లో ఎన్సీపీ నేత శరద్ పవార్ ని కూడా కేసీయార్ కలుసుకున్నపుడు పక్కన ప్రకాష్ రాజ్ ఉన్నారు.
దాన్ని ఆలోచించిన వారు కేసీయార్ ఆయనకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు అని భావించారు. ఇపుడు అదే నిజం అవుతోంది. అయితే ఈ మధ్య బీయారెస్ పార్టీని పెట్టబోతున్నట్లుగా కేసీయార్ ప్రకటించినపుడు, అక్టోబర్ 5న దానికి శ్రీకారం చుట్టినపుడు పక్కన ప్రకాష్ రాజ్ లేకపోవడంతో ఆయన దూరమయ్యారా అని అనుకున్నారు. కానీ అది తప్పు అని ఇపుడు ప్రకాష్ రాజ్ ఆయన వెంట ఉండడంతో తెలుస్తోంది.
విలక్షణ నటుడు విలన్, క్యారక్టర్ ఆర్టిస్టు అయిన ప్రకాష్ రాజ్ సౌతిండియాలో బీయారెస్ అభివృద్ధి కోసం ఏ విధంగా కృషి చేయగలరు అన్నది కూడా ఇపుడు చర్చకు వస్తోంది. ఆయన మంచి నటుడు. ఆ మధ్యన జరిగిన మా ఎన్నికల్లో ప్రెసిడెంట్ పదవికి పోటీ చేసి ఓడారు. అయితే ఆయన రాజకీయంగా ఎంతవరకు సూట్ అవుతారు అన్నది కూడా చూడాలని అంటున్నారు. ఆయన ముక్కుసూటిగా మాట్లాడేస్తారు. రాజకీయాలలో అది కుదరదు.
ఇక కన్నడ నాట చూస్తే బీజేపీ కాంగ్రెస్ బలంగా ఉన్నాయి. మూడవ పక్షంగా జేడీఎస్ ఉంది. ఆ పార్టీ తరఫున మూడు సార్లు సీఎం అయిన నేతగా కుమార స్వామి ఉన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఫుల్ మెజారిటీ వస్తుంది అని కాంగ్రెస్ ధీమాగా ఉంది. బీజేపీ కూడా తమదే విజయం అని చెబుతోంది. ఆ రెండు పార్టీల మధ్య కింగ్ మేకర్ కావాలని కుమారస్వామి పార్టీ చూస్తోంది. మొత్తం కర్నాటకలో జేడీఎస్ కొంత మేర మాత్రమే ప్రభావితం చేస్తుంది. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని బీయారెస్ అక్కడ ఏ రకంగా అద్భుతాలు సృష్టిస్తుంది అన్నది చూడాలని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.