సౌత్ ఇండియా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ శుక్రవారం బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీచేసేందుకు నామినేషన్ దాఖలు చేశారు. ఈయన ఇండిపెండెంట్ గా బరిలో ఉన్నారు.
ప్రకాష్ రాజ్ విలక్షణ నటుడిగా పేరుపొందారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇప్పుడు తన 53వ ఏట ప్రకాష్ రాజ్ దేశ సేవ చేసేందుకు బయలు దేరారు.కొద్దిరోజులు జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసిన ప్రకాష్ రాజ్ బీజేపీని దుమ్మెత్తిపోస్తున్నారు.
ఇక నామినేషన్ వేసిన అనంతరం ప్రకాష్ రాజ్ మాట్లాడారు.. ‘బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజల సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యాయి. అందుకే తాను ప్రజల గొంతుకై నిలబడడానికి ఎంపీగా పోటీచేస్తున్నట్టు’తెలిపారు.
బెంగళూరు సెంట్రల్ నుంచి ఇప్పటికే బీజేపీ పీసీ మోహన్ అనే అభ్యర్థిని ప్రకటించింది. ఆయన కూడా శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఈ సీటుపై అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.
ఇప్పటికే ప్రకాష్ రాజ్ కు ఆమ్ఆద్మీ, బీఎస్పీ పార్టీలు మద్దతు పలికాయి. కాంగ్రెస్ కూడా తనకు మద్దతు ఇవ్వాలని ప్రకాష్ రాజ్ కోరారు.