విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఆది నుంచి బీజేపీ సిద్ధాంతాలను వ్యతిరేకిస్తూనే ఉంటారు. ఈ మేరకు ఆయన ట్వీట్లలో ఎండగడుతుంటారు. ముఖ్యంగా బీజేపీ హిందుత్వ రాజకీయాన్ని ఆయన విమర్శిస్తుంటారు. ఈక్రమంలోనే బీజేపీకి వ్యతిరేకంగా కర్ణాటకలోని బెంగళూరు ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. ఇటీవల 'మా' ఎన్నికల్లో ప్యానెల్ తో పోటీచేసి ఓటమి చవిచూశారు.
తాజాగా నటుడు ప్రకాష్ రాజ్.. ప్రధాని నరేంద్రమోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో కౌంటర్ వేశారు.
ఓ సమావేశంలో చంద్రకాంత్ పాటిల్ మాట్లాడుతూ.. 'ప్రధాని మోడీ రెండు గంటలే నిద్రపోతారని.. ఒక రోజులో 22 గంటల పాటు ఆయన పనిచేస్తుంటారని' ప్రశంసించాడు. దీనిపై ప్రకాష్ రాజ్ సెటైర్లు వేశారు.
ఈ మేరకు ప్రకాష్ రాజ్ ట్వీట్ చేస్తూ.. 'దయచేసి కొంచెం కామన్ సెన్స్ ఉపయోగించండి. నిద్రలేకపోవడం అనేది ఓ జబ్బు. వైద్యపరిభాషలో దీన్ని ఇన్సోమ్మియా అంటారు. దాని గురించి గొప్పలు చెప్పుకోవడం కాదు.. ఆ జబ్బుతో బాధపడుతున్న మీ నాయకుడికి చికిత్స అందించండి' అంటూ రాసుకొచ్చాడు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
ప్రధాని మోడీకి నిద్ర జబ్బు పట్టుకుందని ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పెను దుమారం రేపుతున్నాయి.మోడీని ఆకాశానికి ఎత్తుతున్న నేతలకు ప్రకాష్ ట్వీట్ చెంపపెట్టులా మారిందన్న కౌంటర్లు సోషల్ మీడియాలో పడుతున్నాయి.
ఇక ప్రకాష్ రాజ్ ట్వీట్ పై బీజేపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ప్రకాష్ రాజ్ కు కౌంటర్లు వేస్తున్నారు. మోడీ నిద్ర 2 గంటలేనని చెబుతున్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా ప్రకాష్ రాజ్ మాత్రం మోడీని, బీజేపీ నేతలపై విమర్శలు గుప్పిస్తూనే ఉంటారు.