రాష్ట్రపతి అయినప్పటికీ ప్రణబ్‌ రాజకీయ నేతేనా?

Update: 2015-07-04 04:41 GMT
అత్యున్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు.. అంతకు ముందు తమకు సంబంధించిన అంశాల్ని మర్చిపోతారా? తాజాగా చూస్తే.. ప్రస్తుతం రాష్ట్రపతి హోదాలో ఉన్న ప్రణబ్‌.. సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న విషయం ఆయనకు తెలుసు. పార్టీకి ఆయన సేవలకు ప్రతిఫలంగానే రాష్ట్రపతి పదవి దక్కిందన్న విషయాన్ని మర్చిపోలేరు.

మరి.. అత్యున్నత పదవి వచ్చిన వెంటనే అప్పటివరకూ పార్టీ నేతగా ఉండేవారు మారిపోతారా? అలాంటివి సాధ్యమేనా? అన్న ప్రశ్నకు కాదనే చెప్పాలి. కొందరు నేతలు అయితే తామున్న అత్యున్నత పదవుల్లో ఉన్నప్పటికీ తమ గతాన్ని మర్చిపోరు.

కొందరు మాత్రం ఆయా పదవులకు ఉండే హుందాతనాన్ని దెబ్బ తీయకూడన్న ఉద్దేశ్యంతో పార్టీ వ్యవహారాల్ని వదిలేస్తుంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని తీసుకునే సమయంలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ.. రాష్ట్రపతిగా ఉన్న ప్రణబ్‌ను పలుమార్లు సంప్రదింపులు జరపటం మర్చిపోలేం. తాజాగా పుస్తక ఆవిష్కరణ సందర్భంగా తెలంగాణతో తనకున్న అనుబంధాన్ని చెప్పే క్రమంలో ఆయన చేసిన ఒక వ్యాఖ్యే దీనికి నిదర్శనం.

రాష్ట్రపతి హోదాలో కొన్ని విషయాలు తాను ఇప్పుడు వెల్లడించలేనన్న ప్రణబ్‌ మాటల్ని చూసినప్పుడు.. ఆయనలోని రాజకీయ నేత బయటకు వచ్చినట్లు కనిపిస్తుంది. అయినా రాజకీయనేతగా కొన్ని దశాబ్దాల పాటు సాగించిన పయనాన్ని ఎంత రాష్ట్రపతి అయితే తన పూర్వరంగాన్ని మర్చిపోగలరా?

Tags:    

Similar News