కొన్ని సమస్యలకు కాలమే మంచి పరిష్కారం చూపుతుందన్న మాట నిజమైందని సంతోష పడుతున్నారు తెలుగు తమ్ముళ్లు. తాము ఎంతగా మొత్తుకున్నా అర్థం కాని చాలా విషయాలు తాజాగా రాష్ట్రపతికి అర్థమై ఉంటాయని వారు చెప్పుకుంటున్నారు. వర్షాకాలం విడిది కోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్‌కు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి బాగానే అర్థమై ఉంటుందని వారు భావిస్తున్నారు.
తాజాగా.. గత రెండు రోజులుగా జరిగిన పరిణామాలే దీనికి నిదర్శనమని చెబుతున్నారు.గవర్నర్ ఏర్పాటు చేసిన విందుకు రావాల్సి ఉన్నప్పటికీ జ్వరం కారణంగా రాలేకపోతున్నానని చెప్పటం ఒక నిదర్శనంగా చూపిస్తున్నారు. కేసీఆర్ గైర్హాజరీ కారణంగా.. రాష్ట్రపతి ముఖ్యమంత్రులు ఇద్దరికి కేటాయించిన సమయం చంద్రబాబుకే వచ్చిందని.. ఈ సందర్భంగా పలు విషయాలు ప్రణబ్ దృష్టికి తీసుకెళ్లినట్లుగా చెబుతున్నారు.
రెండు రాష్ట్రాలకు సంబంధించిన వివాదాల విషయంలో గవర్నర్‌ను పెద్దమనిషిగా పెట్టుకొని ఇద్దరం కూర్చుందామని తాను పలుమార్లు పేర్కొన్నప్పటికీ.. కేసీఆర్ నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. చివరకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు దగ్గర రెండు రాష్ట్రాల పోలీసులు ఘర్షణ పడే పరిస్థితి వచ్చినప్పుడు తానే చొరవ తీసుకొని.. మీటింగ్ ఏర్పాటు చేసి ఇష్యూను పరిష్కరించామని చెప్పినట్లుగా తెలుస్తోంది.
తానెంత కలుపుకుపోవాలని చూస్తున్నా కేసీఆర్ సహకారం అందించటం లేదని..తనను రాజకీయంగా దెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్నట్లుగా.. తాజాగా చోటు చేసుకున్న ఉదంతాల్ని ప్రస్తావించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వీటికి స్పందించిన ప్రణబ్.. ఎంతో అనుభవం ఉన్న మీరు.. ఓపిగ్గా ఉంటే అన్ని సర్దుకుంటాయని చెప్పినట్లుగా చెబుతున్నారు. మొత్తంగా తాజా హైదరాబాద్ పర్యటన ప్రణబ్‌కు వాస్తవ పరిస్థితులు అర్థమయ్యేలా చేశాయన్న మాట వినిపిస్తోంది. ఏపీ ముఖ్యమంత్రికి.. తెలంగాణ ముఖ్యమంత్రికి మధ్యనున్న తేడా ఆయనకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుందని.. తమ బాబుకు మంచి మార్కులు పడ్డాయని తమ్ముళ్లు సంబంరంగా చెప్పుకుంటున్నారు. మరి.. వారి మాటల్లో నిజం ఎంతో కాలమే బదులివ్వాలి.