ప్రశాంత్ కిశోర్.. అలియాస్ పీకే.. జాతీయ రాజకీయాల్లో 2014కు ముందు అరంగేట్రం చేసి.. వ్యూహకర్తగా అప్పటి బీజేపీకి పనిచేసిన ఈయన.. తర్వాత కాలంలో రాష్ట్రాల్లోనూ అడుగులు వేశారు. ఈ క్రమంలో ఆయన బిహార్, ఏపీ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ఆయా పార్టీలకు పనిచేశారు. అయితే.. పీకే ఎక్కడికి వెళ్లినా.. ఏదో ఒక లొల్లి పెడతాడు.. అని అందరూ అంటూ ఉంటారు! ఈ క్రమంలో కులాలు, మతాలను రెచ్చగొట్టడం, లోకల్‌గా సెంటిమెంటు చేయడం.. అనేది రాజకీయంగా అబ్బిన విద్యగా చెబుతారు. అంతేకాదు.. కార్యకర్తలకు అబద్దాలు చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం చేయడం.. ఆయనకు అలావాటు.
ఇలానే ఆయన బండిని నడిపించుకుంటు ఉంటాడట. అయితే.. ఇప్పుడు ఏపీలో మరో వివాదం తెరమీదికి వచ్చింది. కేంద్ర ప్రభుత్వాన్ని కొన్ని నెలల కిందట కుదిపేసిన.. పెగాసస్ స్పైవేర్.. ఇప్పుడు ఏపీలో లొల్లికి కారణంగా మారింది. ఇదంతా కూడా పీకేనే చేశాడని.. పెద్ద ఎత్తున రాజకీయ నేతలు.. మేధావులు కూడా చెబుతున్నారు. నిజానికి రాష్ట్రం పచ్చగా ఉంటే.. పీకే చూడలేరని అంటున్నారు. ఎక్కడైనా ఏదొ ఒక తంపు పెట్టిదానిలో సంతో షం వెతుక్కునే వ్యూహకర్తగా పీకే పనిచేస్తాడని మేధావులు సైతం చెబుతున్నారు. వాస్తవానికి ఇప్పుడు ఏపీలో ఏదో ఒక సంక్షేమ పథకంతో కొంత మంది హాయిగా ఉన్నారు.
కానీ, ఇప్పుడు పీకే మాత్రం ఏపీ ఇలా ప్రశాంతంగా ఎందుకు ఉండాలి అనుకున్నాడో ఏమో.. వెంటనే పెద్ద పొగ పెట్టాడని మేధావులు అభిప్రాయపడుతున్నారు. రెండు రోజుల కిందట పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. అక్కడి అసెంబ్లీలో ఒక చిత్రమైన వ్యాఖ్య చేశారు. పెగాసస్ స్పైవేర్ వాళ్లు తమకు ఒక ఆఫర్ ఇచ్చారని.. 25 కోట్లు ఇస్తే.. ఆ స్పైవేర్ను ఇస్తామని చెప్పారని.. ఆమె వెల్లడించారు. అయితే.. ఇది ప్రజల వ్యక్తిగత గోప్యతకు భంగంగా మారుతుంది కనుక.. తాము వద్దని అన్నామని.. ఆమె వెల్లడించారు. కానీ, ఏపీలో మాత్రం అప్పటి చంద్రబాబు ప్రభుత్వం దీనిని కొనుగోలు చేసిందని.. ఆమె చెప్పారు.
దీంతో ఇది ఏపీలో అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీల మధ్య తీవ్రస్థాయిలో యుద్ధానికి దారితీసింది. ఇప్పటికే ఇరు పార్టీలు కూడా రాజకీయంగా కత్తులు దూసుకుంటున్న నేపథ్యంలో పెగాసస్ మరింతగా ఈ వేడిని పెంచేసింది. అయితే.. ఇక్కడ కీలకమైన ప్రశ్న ఒకటి తెరమీదికి వచ్చింది. అసలు ఎక్కడో ఉన్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతకు.. ఏపీలో జరిగిన విషయం ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? అనేది ప్రశ్న. ఇదే విషయాన్ని మేధావులు సైతం నిలదీస్తున్నారు. మమతకు.. రాజకీయ సలహాదారుగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్.. ఈ విషయం చెప్పి ఉంటారనే అనుమానాలు వస్తున్నాయి.
లేకపోతే.. ఇజ్రాయెల్ ప్రభుత్వమే చెప్పిందా? దీనికి ఏమైనా సాక్ష్యం ఉందా? అనేది కీలక ప్రశ్న. ఎలాగూ.. మమతా బెనర్జీ.. రాష్ట్రంలో లొల్లి జరుగుతోంది. ఇప్పుడు ఏపీలో పీకే కారణంగా.. ఇబ్బంది పెట్టాలా? అనేది ప్రజలు అడుగుతున్న ప్రశ్న. నిజానికి మమతా బెనర్జీ కూడా విషయం పూర్తిగా తెలుసుకోకుండా.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎందుకు? అని చదువుకున్న వారు కూడా ప్రశ్నిస్తున్నారు. దేశంలో ఇప్పటికే పెగాసస్ తీవ్రస్థాయిలో రాజకీయ దుమారం రేపుతోంది. ఇలాంటి సమయంలో ఏపీలోనూ చిచ్చు పెట్టాలని చూస్తున్నాడు.. అనిపీకేపై విద్యావంతులు.. మేధావులు సైతం నిప్పులు చెరుగుతున్నారు. మరి ఇది ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.