రాజకీయ నేతలకు తొందరపాటు పనికి రాకూడదు. కాస్త ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా జరిగిన వెంటనే ముందు వెనుకా చూసుకోకుండా మాట్లాడేయటం.. ఆ మాటలతో పార్టీని.. పార్టీ అధినేతను బుక్ చేసే తీరు ఈ మధ్యన ఏపీ అధికారపక్షంలో ఎక్కువ అవుతోంది. తాజాగా అలాంటి ప్రయత్నమే మరొకటి జరిగింది. కొంతలో కొంత నయమేమిటంటే.. ఒక తెలుగు తమ్ముడు తన మాటలతో డ్యామేజ్ చేస్తే.. మరో తమ్ముడు ఆ డ్యామేజ్ ను కంట్రోల్ చేసి కవర్ చేసే ప్రయత్నం చేశారు.
పశ్చిమగోదావరి జిల్లాలలో ఏర్పాటు చేస్తున్న మెగా అక్వా ఫుడ్ పార్క్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ గళం విప్పటం.. అక్కడి సమస్యల్ని ఏపీ సర్కారు దృష్టికి తీసుకెళుతూ నిన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేయటం.. పుడ్ పార్క్ తో జరిగే నష్టాన్ని మీడియా ద్వారా కొత్త చర్చను రేపటంతో పాటు.. వీలైతే ఆ పార్క్ ను నిలిపివేయాలని.. లేదంటే సముద్ర తీర ప్రాంతానికి తరలించాలన్న సూచనను చేశారు పవన్ కల్యాణ్. ఈ అక్వాపార్క్ కారణంగా నదీజలాలు నాశనమవుతాయని.. కాలుష్య కాసారంగా మార్చే ఈ ఫుడ్ పార్క్ కారణంగా అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాలు తీవ్రంగా ప్రభావితం అవుతాయంటూ పవన్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అక్వాపార్క్ ఏర్పాటుతో ఆ ప్రాంతాన్ని మరో నందిగ్రామ్ లా మార్చొద్దంటూ అధికారపక్షానికి ఎక్కడ తగలాలో అక్కడ తగిలే మాటను చెప్పారు.
పవన్ కల్యాణ్ లాంటి వ్యక్తి నోరు తెరిచి మాట్లాడారంటే.. దాని మీద ఎంతోకొంత కసరత్తు.. అధ్యయనం.. నిపుణులతో మంతనాలు జరిపిన తర్వాతే తెరపైకి వస్తారు.ఆ విషయాన్ని గుర్తించని టీడీపీ అధికార ప్రతినిధి వైవీబీ రాజేంద్రప్రసాద్ మీడియా ముందుకు వచ్చేసి చేసిన వ్యాఖ్యలు పార్టీకి.. ప్రభుత్వానికి నష్టం చేకూరేలా ఉన్నాయని చెప్పొచ్చు. ఈ అక్వా ఫుడ్ పార్క్.. కాలుష్య రహితప్రాజెక్టుగా కాలుష్య నియంత్రణ సంస్థ నిర్ధారించినట్లుగా పేర్కొన్న రాజేంద్ర ప్రసాద్.. పర్యావరణానికి.. ప్రజలకు హాని చేసే విష వాయువులు వెలువడవంటూ పేర్కొన్నారు.
పరిశ్రమలను వ్యతిరేకిస్తే యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయంటూ ప్రశ్నించిన ఆయన తీరు.. ప్రాజెక్టుతో కాలుష్యం ఉండదని.. రసాయనాలు వాడరంటూ ఆయన వ్యాఖ్యానించారు. స్థార్వ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవటం సరికాదంటూ వ్యాఖ్యానించారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడిన మాటలన్నీ పవన్ కల్యాణ్ మాటల్ని కౌంటర్ చేసేలా ఉండటం గమనార్హం. అయితే.. పవన్ వ్యాఖ్యలపై విమర్శలు చేయటం ద్వారా లేనిపోని తలనొప్పులు తెచ్చుకోవటంతో పాటు.. ప్రభుత్వానికి నష్టం కలగటం ఖాయమన్న భావనకు వచ్చిన మంత్రి పత్తిపాటి పుల్లారావు తాజాగా రియాక్ట్ అయ్యారు.
రాజేంద్రప్రసాద్ చేసిన తరహాలో కాకుండా మంత్రి పత్తిపాటి ఆచితూచి స్పందించారు. అక్వా ఫుడ్ పార్క్ పై పవన్ కల్యాణ్ చేసిన సూచనల్ని పరిగణలోకి తీసుకుంటామని.. రైతుల సమస్యల్ని పరిష్కరించే అంశంపై దృష్టి పెడతామని వ్యాఖ్యానించారు. ‘‘పవన్ మా పార్టీకి కావాల్సిన వ్యక్తి. ఆయనేం చెప్పినా మేం వింటాం. ఆయన్నుంచి సలహాలు.. సూచనలు స్వీకరిస్తాం’’ అంటూ అనునయంగా మాట్లాడిన పత్తిపాటి మాటలు బాధితులకు కాస్తంత ఊరడింపుగా ఉంటాయనటంలో సందేహం లేదు. పవన్ మాట్లాడిన వెంటనే రియాక్ట్ అయిన రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలతో జరిగిన డ్యామేజ్ ను మంత్రి పత్తిపాటి సంయమనంతో మాట్లాడి డ్యామేజ్ కంట్రోల్ చేసినట్లుగా చెప్పొచ్చు. తరచూ తొందరపడే రాజేంద్రప్రసాద్ లాంటి వాళ్లను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత బాబుదేనన్న విషయాన్ని ఆయన గుర్తిస్తే మంచిది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/