హోళీ పండుగను దేశంలోని ప్రతి ఒక్కరూ కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ప్రతి ఏడాది వసంత మాసంలో వచ్చే ఈ రంగుల పండుగను, బంధుమిత్రులు, స్నేహితులు, సన్నిహితులతో, రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకుంటుంటారు. . ప్రజలు తమ తమ ఆచార వ్యవహాలు, సంప్రదాయం ప్రకారం పండుగను చేసుకుంటున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో తక్కువే కానీ, ఉత్తరప్రదేశ్ లాంటి ఉత్తరాది రాష్ట్రాల్లో మనుషులకు బదులు హోలీ రంగులే కనిపిస్తున్నాయి. తెల్లటి బట్టలు కాస్తా రంగులమయం అయిపోయాయి. కరోనా జాగ్రత్తలు పాటిస్తూనే హోలీ హోలీ అంటూ వేడుకలు జరుపుకుంటున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా, అమెరికా ఉపాధ్యక్షురాలు, భారత సంతతి మహిళ కమలా హారిస్ ఇలా పలువురు దేశ ప్రజానికానికి హోలీ పండుగ శుభాకాంక్షలు చెబుతున్నారు. దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోడీ. హోలీ సామరస్యంతో కూడిన పండుగ అన్న కోవింద్..అందరీ జీవితాల్లో సంతోషం నింపాలని ఆకాంక్షించారు. ఈ పండుగ జాతీయవాదం యొక్క స్ఫూర్తిని మరింత బలపరుస్తుందన్నారు. దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోడీ. ఈ హోలీ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ కూడా విషేస్ చెప్పారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ పండుగ జరుపుకోవాలని సూచించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యేక ఫొటోతో విషెస్ చెప్పారు. సంతోషం, ఐక్యత, కలిసిమెలిసి జరుపుకునే ఈ పండుగ అందరిలోనూ ఆనందం, శాంతిని తేవాలని కోరారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కూడా తనదైన శైలిలో శుభాకాంక్షలు చెప్పారు. హోలీ నాడు అందరూ విబేధాలను పక్కనపెట్టి... కలిసి మెలిసి జరుపుకోవాలని కోరారు. ఈ కరోనా కాలంలో ఒకరికి ఒకరు తోడుగా ఉంటామనే సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వాలని కోరారు.