మార్ఫింగ్ చేయటం ఆ శాఖకు మామూలేనా?

Update: 2015-12-08 07:07 GMT
భారీ వరదల కారణంగా మునిగిన చెన్నై మహానగరాన్ని ఏరియల్ వ్యూలో ప్రధాని నరేంద్ర మోడీ పరిశీలించటం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఫోటోను విడుదల చేసిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో చేసిన ఒక వెధవ పని.. తీవ్ర విమర్శలకు గురి కావటమే కాదు.. నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడటం తెలిసిందే.

మోడీ ఏరియల్ వ్యూ ఫోటోను ఫోటోషాప్ చేసి.. మార్ఫింగ్ ఫోటోను ప్రెస్ కు రిలీజ్ చేయటమేకాదు.. తమ అధికారిక వెబ్ సైట్ లో ఉంచటం.. దీనిపై సోషల్ మీడియాలో జోకుల మీద జోకులు వెల్లువెత్తటంతో వెనక్కి తగ్గిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తన మార్ఫింగ్ ఫోటోను డిలీట్ చేయటం తెలిసిందే. అయితే.. ఈ విషయంపై చెంపలేసుకోవాల్సింది పోయి.. చేసిన వెధవ పనిని సమర్థించుకునే ప్రయత్నం చేయటం మరింత మందికి మంట పుట్టిస్తోంది.

ప్రజలకు స్పష్టంగా వరద నష్టం చూపిద్దామనే ఫోటోను మార్ఫింగ్ చేసినట్లుగా చెప్పటమే కాదు.. ఇలాంటి వెధవ పనినే గతంలో ప్రధానిగా పని చేసిన మన్మోహన్ హయాంలో కూడా చేసినట్లుగా చెబుతున్నారు. ప్రముఖుల ఏరియల్ వ్యూను మరింత బాగా కనిపించేలా చేయటం కోసం ఇలా ఫోటోషాప్ లో మార్చి.. మార్ఫింగ్ ఫోటోల్ని విడుదల చేస్తారని చెబుతున్నారు. ఈ వాదనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవేళ.. అలా చేయాలంటే.. ఆ విషయాన్ని తమ ఫోటోలోనే చెప్పేస్తే సరిపోయేది కదా? అన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News