పొగడ్త ఎలా ఉండాలో భారతీయులకు తెలిసేలా చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. హోస్టన్ సభలో 50వేలకు పైచిలుకు ప్రవాసభారతీయుల్ని ట్రంప్ నకు చూపిస్తూ.. నా కుటుంబాన్ని పరిచయం చేస్తున్నానని చెప్పటమే కాదు.. భారతమూలాలున్న అమెరికన్లు అందరూ మరోసారి ట్రంప్ ను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నుకోవాలన్న విషయాన్ని చెప్పేశారు మోడీ.
ప్రపంచ దేశాలన్ని ఆసక్తిగా చూస్తున్న సభలో.. సాహసోపేతంగా మోడీ చేసిన ప్రకటనకు ట్రంప్ ఎంతలా ముగ్ధులయ్యారన్న విషయాన్ని 48గంటల వ్యవధిలోనే తన మాటల్లో చెప్పేశారు అగ్రరాజ్య అధిపతి. ఇప్పటివరకూ మోడీని చాలామంది చాలా విధాలుగా పొగిడి ఉంటారేమో కానీ.. అమెరికా అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తి.. మోడీని ఏకంగా భారతజాతి పితగా అభివర్ణించటమేకాదు.. ఇకపై తాను ఆయన్ను అలానే పిలుస్తానని చెప్పటం ద్వారా సంచలనంగా మారారు.
‘‘మోడీ పెద్ద మనిషి. గొప్ప నాయకుడు. ఆయనంటే నాకెంతో గౌరవం.. ఇష్టం. ఇంతకుముందు భారత్ చీలిపోయి, అసమ్మతితో, అంతర్గత కుమ్ములాటలతో సతమతమయ్యేది. మోడీ అందర్నీ ఏకం చేశారు. ఒక ఇంట్లో ఓ తండ్రి మాదిరిగా అందరినీ ఒక్క దరికి చేర్చారు. ఆయన ఇండియాకు తండ్రిలాంటి వారు. ఇక నుంచి మేం ఆయన్ను భారత జాతిపిత అనే పిలుస్తాం’’ అంటూ ట్రంప్ చేసిన ప్రశంస భారీదే కాదు.. మోడీ ఇమేజ్ ను మరో స్థాయికి తీసుకెళ్లేదిగా చెప్పక తప్పదు.
మోడీకి ఉన్న ప్రజాదరణను.. కోట్లాది మంది అభిమానాన్ని చూరగొన్న అమెరికన్ పాప్ సింగర్ రాక్ అండ్ రోల్ కింగ్ ఎల్విస్ ప్రెస్టీతో పోల్చటం మరో విశేషం. హోడీ మోడీ సభలో వచ్చిన స్పందన చూడాలని.. వాళ్లంతా మోడీని ఎంతో ఇష్టపడ్డారని.. వారిలో విపరీతమైన అభిమానం కనిపించిందన్నారు. ప్రెస్లీ అంటే కూడా అలానే ఉండేదని..బహుశా మోడీ ప్రెస్లీలాంటివారేనని తేల్చేశారు.
భారత్.. పాక్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో మధ్యవర్తిత్వానికి సిద్ధమని చెప్పిన ట్రంప్.. రోజు గడిచేసరికి మోడీ మీద తనకున్న అభిమానాన్ని.. కశ్మీర్ అంశంపై మోడీ.. ఇమ్రాన్ లు ఇద్దరూ కలిసి ఏదో ఒకటి తేల్చుకుంటారని తాను విశ్వసిస్తున్నట్లు చెప్పేశారు. దీంతో.. కశ్మీర్ అంశం రెండు దేశాల మధ్య ఇష్యూగా తేల్చేశారని చెప్పాలి. ఏమైనా.. మోడీని భారత జాతిపిత అన్న భారీ ప్రశంస అంతర్జాతీయ మోడీ ప్రతిష్టను భారీగా పెంచటం ఖాయమని చెప్పక తప్పదు.