బెజవాడలో మోడీకి మళ్లీ పెళ్లి

Update: 2019-01-07 11:15 GMT
ట్రిపుల్ తలాక్.. ముస్లింల  సంప్రదాయానికి విరుద్ధంగా  దీన్ని నిషేధిస్తూ బీజేపీ ప్రభుత్వం ఇటీవలే పార్లమెంట్ లో బిల్లు పాస్ చేసింది. దీంతో బీజేపీపై ముస్లింలందరూ ఆగ్రహంగా ఉన్నారు. అందుకే తాజాగా విజయవాడలో కొందరు ముస్లింలు ట్రిపుల్ తలాక్ బిల్లును వ్యతిరేకిస్తూ మోడీకి మళ్లీ వివాహం జరిపించారు.

విజయవాడలో సోమవారం ముస్లింలు నరేంద్రమోడీ - ఆయన భార్య జశోదాబెన్ చిత్రపటాల మాస్క్ లను ఇద్దరికి తగిలించి పెళ్లి చేశారు. ఈ పెళ్లికి ముస్లింలు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మోడీ వైఖరిని ముస్లింలు తూర్పార పట్టారు. ముస్లింల తలాక్ బిల్లుకు చట్టబద్ధత వచ్చినా తమ సంప్రదాయాన్ని కొనసాగిస్తామని విడిచిపెట్టమని వారు స్పష్టం చేశారు.
 
సుధీర్ఘ చర్చలు - గొడవలు - వ్యతిరేతకల నడుమ ఇటీవలే పార్లమెంట్ లో త్రిపుల్ తలాక్ బిల్లును కేంద్రం పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది. దీనిపై  ఓటింగ్ పెట్టారు. బిల్లుకు అనుకూలంగా 245 మంది ఓటు వేయగా.. వ్యతిరేకంగా 11 మంది ఓటేశారు. దీంతో ట్రిపుల్ తలాక్ బిల్లు అమోదం లభించిందని స్పీకర్ ప్రకటించారు.


Full View

Tags:    

Similar News