బ్రిటన్ రాణికంటే ప్రధాని రిషి సునక్ భార్యనే ధనవంతురాలు

Update: 2022-10-25 05:10 GMT
బ్రిటన్ ప్రధానిగా రిషి సునక్ నియామకం అయ్యారు.  రిషి సునక్ భారతీయ మూలానికి చెందినప్పటికీ సాంకేతికంగా బ్రిటిష్ వారు. కానీ అతని భార్య అక్షతా మూర్తి భారతదేశంలోని హిందూ సనాతన కుటుంబానికి చెందినది. ఆమె తండ్రి నారాయణ మూర్తి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు.. ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తులలో ఒకరు.

అక్షత తల్లి సుధామూర్తి ఒక గొప్ప రచయిత్రి, ఆమె రచనలు చాలాసార్లు ప్రచురించబడ్డాయి. హాట్ ఫేవరెట్‌గా అమ్ముడవుతున్నాయి. కొత్త తరం ఆంగ్ల పాఠకులకు హిందూ పురాణ కథలను చేరువ చేయడంపై ఆమె దృష్టి ప్రధానంగా ఉంది. ఆమెను "భారతదేశానికి ఇష్టమైన బామ్మ" అని పిలుస్తారు.

సుధా మూర్తి ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో తన పిల్లలు ఆశాత , రోహన్‌లను ఎంత కఠినంగా పెంచారో చెప్పారు. సంపన్నుడైన తండ్రి ఉన్నప్పటికీ పిల్లల జీవితాన్ని ఆమె ఎప్పుడూ సుఖవంతంగా పెంచలేదట.. ఆమె వారికి సరళత నేర్పింది. ఇంట్లో టెలివిజన్ కూడా లేకుండా వారిని పెంచింది. అది వారి చదువులకు భంగం కలిగించవచ్చని తీసేసిందట..

నారాయణ మూర్తి సునక్ పేరును భిన్నంగా ఉచ్చరించేవారట.. బహిర్గతం కానప్పటికీ.. ఇది భారతదేశంలోని సన్యాసి , పురాతన ఋషి పేరు కనుక సౌనక్ అని పిలిచేవారట.. అతనిని "తెలివైనవాడు, అందమైనవాడు .. ముఖ్యంగా, నిజాయితీపరుడు" అని అల్లుడిని పొగిడేవాడట..".

అక్షత ,రిషి స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకునేటప్పుడు ప్రేమలో పడ్డారు. వీరికి 2009లో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిపించారు.

ఇన్ఫోసిస్‌లో అక్షత వాటా విలువ దాదాపు 700 మిలియన్ డాలర్లు. ఆమె దివంగత క్వీన్ ఎలిజబెత్ -II కంటే సంపన్నురాలు అని చెబుతున్నారు.  ఇటీవల ఆమె ట్వీట్ చేస్తూ "భారతదేశం నా జన్మస్థలం, పౌరసత్వం, తల్లిదండ్రుల ఇల్లు, నివాస స్థలం అదే. కానీ నేను బ్రిటన్ ని కూడా ప్రేమిస్తున్నాను" అని ట్వీట్ చేసింది.

ఈ దంపతులకు అనుష్క, కృష్ణ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రిషి సునక్ సాంకేతికంగా బ్రిటన్ చరిత్రలో తన భార్య ఆదాయాన్ని తన కుటుంబ ఆదాయంలో భాగంగా లెక్కిస్తే మాత్రం ఇప్పటివరకూ బ్రిటన్ ను పాలించిన వారిలో అత్యంత ధనిక ప్రధానమంత్రిగా నిలుస్తాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News