అలియా కంటే ప్రియాంక మహా డేంజర్ అంట

Update: 2015-10-08 04:25 GMT
బాలీవుడ్ ముద్దుగుమ్మలు అలియాభట్.. ప్రియాంకల పేర్లు విన్న వెంటనే వారి అందం గుర్తుకు వచ్చేస్తుంది. వారి సొగసుకు ఫిదా కాని వారి ఉండరు. కానీ.. వారి పేర్లలో ఉన్నఅసలు విషయం తెలిస్తే మాత్రం కంగుతినాల్సిందే.

కంప్యూటర్లను హ్యాక్ చేసి అందులోని కీలక సమాచారాన్ని కొల్లగొట్టేసే నేరాలకు సంబంధించి ప్రియాంక చోప్రా పేరును చాలా ఎక్కువగా వినియోగిస్తారట. అంటే..వెండితెర మీద అందాల దేవత అయిన ప్రియాంక చోప్రాను అభిమానిస్తే.. అదే ప్రేమను ఆన్ లైన్ లో కూడా ప్రదర్శిస్తే అడ్డంగా బుక్ అయినట్లే అని చెబుతున్నారు. ఆ విసయాన్ని చెబుతున్నది సాదాసీదా వ్యక్తులు కాదు.. ఇన్ టెల్ సెక్యూరిటీ సంస్థ తన తాజా నివేదికలో తేల్చింది. గతంలో అలియా భట్ పేరుతో ఇలాంటివి జరిపేవారని.. ఈ ఏడాది మాత్రం అలియా భట్ కన్నా.. ప్రియాంకచోప్రానే మహా డేంజర్ అని తేల్చేస్తున్నారు.

ప్రియాంక చోప్రాకు సంబంధించిన సమాచారం కోసం వెతికినా.. వీడియోల కోసం సెర్చ్ చేసినా.. కంప్యూటర్ హ్యాకర్ల చేతికి చిక్కేసినట్లుగా చెబుతున్నారు. కంప్యూటర్లు హ్యాక్ కావటానికి ప్రియాంక చోప్రా పేరు తొలిస్థానంలో ఉంటే.. తర్వాత స్థానంలో శ్రద్ధా కపూర్ ఉందని చెబుతున్నారు. అందుకే.. ఆన్ లైన్ లో సెర్చ్ చేసే సమయంలో ముద్దుగుమ్మల పేర్లు.. మరి ముఖ్యంగా ప్రియాంక.. శ్రద్ధా కపూర్ లాంటి భామల గురించి వెతకకుండా ఉండటం ఉత్తమం. ఒకవేళ వెతికినా.. ఓపెన్ చేసే పేజీలు జాగ్రత్తగా చూసుకోవటంతో పాటు.. ఏది పడితే దాన్ని డౌన్ లోడ్ కూడా చేసుకోకుండా ఉండటం మీకు.. మీ కంప్యూటర్ కు క్షేమకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Tags:    

Similar News