జాతీయ పార్టీలకు ప్రాణప్రదంగా మారిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ఏ పార్టీకి ఆ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీ కుమార్తె, మాజీ ప్రదాని దివంగత ఇందిరమ్మ మనవరాలు... ప్రియాంక గాంధీ సంచలన ప్రకటన చేశారు. యూపీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఎవరిని ముఖ్యమంత్రిని చేస్తారు? అన్న ప్రశ్నకు ఆమె ఆసక్తిగా స్పందించారు. తానే ముఖ్యమంత్రి అవుతానని సమాధానమిచ్చారు.
దీంతో రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్యమైన అలజడి నెలకొంది. ఎందుకంటే.. ఏ పార్టీకైనా.. ముఖ్యమంత్రి అభ్యర్థిని బట్టే.. ఓటు బ్యాంకు రాజకీయం ఆధారపడి ఉంటుంది. బీజేపీ తరఫున యోగి ఆదిత్యనాథ్‌ను మరోసారి ప్రకటించినా.. సమాజ్ వాదీ పార్టీ తరఫున అఖిలేష్ సీఎంగా బరిలో దిగినా.. ఆయా పార్టీలు పుంజుకుంటాయనే వ్యూహాలతోనే ! ఇప్పుడు రాష్ట్రంలో అంతంత మాత్రంగా ఉన్నకాంగ్రెస్ ను పరుగు లు పెట్టించేందుకు ఆ పార్టీ పెద్ద ఎత్తున ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనేగడిచిన రెండేళ్లుగా ప్రియాంక రాష్ట్రంలో అనేక రూపాల్లో పార్టీ కోసం కష్టపడుతున్నారు.
అయినప్పటికీ..ఊపు కనిపించడం లేదన్నది వాస్తవం. అయితే.. ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనను తానే ప్రకటించుకోవడం ద్వారా.. ప్రియాంక వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని అంటున్నారు పరిశీలకులు. త్వరలోనే కాంగ్రెస్ దీనిపై అధికారిక ప్రకటన ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే.. ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ ప్రియాంక ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టొచ్చు. అయితే ఆరు నెలల్లోగా శాసనసభ లేదా శాసనసమండలి ఏదో ఒకదానికి ఎన్నికవ్వాల్సి ఉంటుంది.
గతంలో యూపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన మాయావతి, అఖిలేశ్ యాదవ్‌తో పాటు ప్రస్తుత ముఖ్య మంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఎమ్మెల్సీనే కావడం గమనార్హం. ఇదిలావుంటే.. అసలు వ్యూహాననికి వస్తే..ప్రియాంక ఎత్తుగడ ఫలించేనా? అనేది ప్రశ్న. ఎందుకంటే.. జాతీయ స్థాయిలో కేంద్రంలో అధికారం కోసం ఎదురు చూడాల్సిన,.. పోరాడాల్సిన గాంధీ ల కుటుంబం ఒక్క సీఎం స్థానానికి తగ్గిపోవడం అనేది.. దేశ చరిత్రలో తొలిసారి అంటున్నారు పరిశీలకులు.
గాంధీ ల కుటుంబం ఎప్పుడూ... ఏ రాష్ట్రానికీ ముఖ్యమంత్రి చేసినసందర్భాలు లేవు. కేంద్రంలోనే అధికారం కోసం పాకులాడారు. కానీ, ఇప్పుడు ప్రియాంక చేసిన ప్రకటన సక్సెస్ అయితే.. మంచిదే లేకపోతే.. రివర్స్ అవుతుందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.