ఆ రాష్ట్రంలో ఆర్థికమంత్రి ఇంటినే కాల్చేశారు

Update: 2016-02-19 15:00 GMT
కులచిచ్చు ఒక్కసారి రేగిందంటే అదెంత తీవ్రంగా ఉంటుందన్న విషయం తాజాగా తెలుగు ప్రజలకు మరోసారి అర్థమైంది. ఏపీలో కాపుల్ని బీసీల్లో చేర్చాలంటూ చేపట్టిన ఆందోళన ఎంత తీవ్రంగా మారిందన్న విషయం తెలిసిందే. ఏకంగా ఒక ట్రైన్ ను కాల్చేసే వరకూ వెళ్లటమే కాదు.. మూడు పోలీస్ స్టేషన్లు.. పదుల సంఖ్యలో వాహనాలు దగ్థమయ్యాయి.

ఈ సమస్య నుంచి కిందామీదా పడిన ఏపీ సర్కారు కాస్త బయటకొస్తే.. తాజాగా హర్యానాలోని జాట్ లు తమకు రిజర్వేషన్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం తాజాగా వారు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారటమే కాదు.. హర్యానా రాష్ట్ర ఆర్థికమంత్రి కెప్టెన్ అభిమన్యు ఇంటిని నిప్పు పెట్టేశారు. ఏకంగా మంత్రి ఇంటినే నిరసనకారులు దగ్థం చేయటంతో పరిస్థితి మహా ఉద్రిక్తంగా మారింది. కులాల విషయంలో అధినేతలు ఎంత అప్రమత్తంగా ఉండాలన్న దానికి తాజా ఉదంతం ఒక హెచ్చరికగా చెప్పాలి.
Tags:    

Similar News