జ‌గ‌న్‌ పై జ‌నం టాక్ : కేబినెట్ ఆఫ్ ది రికార్డ్ డిబేట్

Update: 2020-11-29 02:30 GMT
ఏ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్వ‌హించే కేబినెట్ భేటీలో అయినా.. అనేక కీల‌క విష‌యాలుచ‌ర్చ‌కు వ‌స్తాయి. అయితే.. స‌హ‌జంగా మీడియాకు వెల్ల‌డించే విష‌యాలు వేరుగా ఉంటాయి. అంత‌ర్గ‌తంగా చ‌ర్చ‌కు వ‌చ్చే అంశాల్లో కొన్ని ముఖ్య‌విష‌యాలు వేరేగా ఉంటాయి. వీటిని సాధార‌ణంగా బ‌హిరంగ వ్య‌క్తం చేయ‌రు. ఒక‌రో ఇద్ద‌రో.. మంత్రులు.. త‌మ‌కు అత్యంత స‌న్నిహితులైన మీడియా మిత్రుల‌కు చూచాయ‌గా చెబుతారు. ఇలా.. ఏపీ కేబినెట్‌లో జ‌రిగిన ఓ అంత‌ర్గ‌త అంశంపై కొన్ని విష‌యాలు వెలుగు చూశాయి.

వీటిలో ప్ర‌ధానంగా.. జ‌గ‌న్ స‌ర్కారుపై జ‌నం ఏమ‌నుకుంటున్నారు? అనే అంశాన్ని.. కేబినెట్‌లో చ‌ర్చించి నట్టు తెలిసింది. జ‌గ‌న్ ప్ర‌వేశ పెడుతున్న ప‌థ‌కాలు, సంక్షేమ కార్య‌క్ర‌మాలు వంటివి ఎలా అమ‌ల‌వుతు న్నాయి? వాటిని జ‌నం ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా మ‌హిళ‌లు, పేద‌ల్లో ప్ర‌భుత్వంపై ఎలాంటి టాక్ ఉంది? అనే విష‌యాల‌ను మంత్రుల‌తో జ‌గ‌న్ పంచుకున్న‌ట్టు అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గా ల‌ స‌మాచా రం. నిజానికి ఏ ప్ర‌భుత్వ‌మైనా.. త‌న పాల‌న‌పై ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటున్నార‌నే విష‌యాన్ని ఏదో ఒక రూపంలో సేక‌రిస్తూనే ఉంటుంది.

అదేవిధంగా జ‌గ‌న్ స‌ర్కారు కూడా రెండు ఛానెళ్ల ద్వారా త‌న స‌ర్కారుపై నాడిని ప‌సిగ‌ట్టింద‌ని తెలుస్తోం ది. దీనిపై కేబినెట్‌లో ముఖ్య‌మంత్రి ప్ర‌స్థావ‌న తెచ్చార‌ట‌. ``ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న స‌మాచారం ప్ర‌కారం. మ‌న‌కు సైలెంట్ పాజిటివిటీ ఉంది. ముఖ్యంగా మ‌హిళ‌ల్లో సానుభూతి ఉంది. మ‌నం భ‌య‌ప‌డిపోవాల్సిన అవ‌స‌రం ఏమీలేదు. ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌ను ఖాత‌రు చేయాల్సిన అవ‌స‌రం లేదు`` అని జ‌గ‌న్ అన్న‌ట్టు తెలిసింది. వ‌లంటీర్ల ద్వారా క్షేత్ర‌స్థాయిలో సేక‌రించిన స‌మాచారం, ఇంటిలిజెన్స్ వ‌ర్గాల ద్వారా.. ప్ర‌భుత్వం త‌నపై ప్ర‌జ‌ల్లో ఉన్న నాడిని ప‌సిగ‌ట్టిన‌ట్టు తెలుస్తోంది.

మొత్తంగా చూస్తే.. జ‌గ‌న్ విష‌యంలో సైలెంట్ టాక్ న‌డుస్తోంద‌ని, మ‌హిళ‌ల్లో పాజిటివిటీ పెరుగుతున్న‌ట్టు మీడియాతో నిత్యం స‌న్నిహితంగా ఉండే.. ఓ మంత్రి చెప్పుకొచ్చారు. `అయితే.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గంలో ప‌రిస్థితి ఏంట‌నేది మా నాయ‌కుడు చెప్ప‌లేదు`- అని ముక్తాయించ‌డం గ‌మ‌నార్హం.


Tags:    

Similar News