దేశీయ సినీ పరిశ్రమ ఉలిక్కి పడే రీతిలో ఈ ఏడాది ఫిబ్రవరీలో మళయాళ సినీ నటిపై జరిగిన లైంగిక దాడియత్నంలో కొత్త సంఘటన తెరమీదకు వచ్చింది. మళయాల హీరోయిన్ పై ఆమె కారు డ్రైవర్ - మాజీ డ్రైవర్ సహా ఏడుగురు నిందితులు అత్యాచారయత్నానికి పాల్పడినట్లు మొదట తెరమీదకు వచ్చి ఆ తదుపరి అది ఉద్దేశపూర్వక దాడి అని తేలిన సంగతి తెలిసిందే. మళయాళ సినిమా పరిశ్రమలోని ఒక హీరో - మరికొందరు కలిసే హీరోయిన్ పై ఈ రేప్ చేయించారని పోలీసుల విచారణలో వెల్లడైంది.
ప్రముఖ హీరోయిన్‌పై అత్యాచారయత్నం కేసులో కీలక నిందితుడిగా ఉన్న సునీ అత్యంత ఆసక్తికరమైన రీతిలో దాడికి సంబంధించిన అసలు విషయాలను పంచుకున్నాడు. పోలీసుల విచారణ సందర్భంగా ఏ విషయమూ వెల్లడించని సునీ త్రిస్సూర్ జిల్లాలోని కక్కనాడ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న క్రమంలో తోటి ఖైదీ జిన్సీతో అభిప్రాయాలను పంచుకున్నారు. జిన్సీ పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం...ఈ ఏడాది ఫిబ్రవరి 17వ తేదీన తన స్నేహితులను కలిసేందుకు కొచ్చి వెళ్తుండగా మార్గమధ్యంలో నటిని అపహరించి దాడి చేయాల్సిందిగా ఓ మెగాస్టార్ తనతో బేరం కుదుర్చుకున్నాడని తెలిపాడు. ఈ విషయాన్ని జిన్సీ జైలు అధికారులకు వెళ్లడించారు.
సంచలనం రేకెత్తించిన ఈ కేసులో కొత్త కోణం బయటకు వచ్చిన నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. జైల్లోని జిన్సె ద్వారా తాజాగా తెలిసిన వివరాల ఆధారంగా న్యాయమూర్తి ఎదురుగా పల్సర్ సుని వాంగ్మూలం రికార్డు చేస్తామని పోలీస్ వర్గాలు మీడియాకు తెలిపారు. సునీని మరోమారు విచారించి కొత్తగా తెరపైకి వచ్చిన వ్యక్తులకు నోటీసులు జారీ చేస్తామన్నారు. కాగా, షూటింగ్ ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో ఆమె డ్రైవర్ అప్పటికే కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం సునీ గ్యాంగ్‌కు సమాచారం ఇచ్చి ఆమె వాహనాన్ని చేజ్ చేస్తూ అఘాయిత్యానికి పాల్పడే ప్రయత్నం చేశారు. దాదాపు రెండు గంటల పాటు అలా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసి ఒకదశలో అత్యాచారయత్నం చేశారు. అయితే ఈ ఘటన నుంచి హీరోయిన్ తప్పించుకున్నారు. ఈ ఘటనలో హీరోయిన్‌పై రేప్ జరిగిందని ప్రచారం జరిగినప్పటికీ అలాంటి దుర్ఘటన ఏదీ చోటుచేసుకోలేదని ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ ఆ హీరోయిన్ తో మాట్లాడిన అనంతరం స్పష్టత ఇచ్చారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/