తప్పుడు పనులు చేస్తూ.. ఉన్న కొద్దిపాటి గౌరవాన్ని.. నమ్మకాన్ని వమ్ము చేస్తున్న కొందరు దుర్మార్గుల కారణంగా మొత్తానికి మొత్తమే అనుమానంగా చూసే దుస్థితి. మొన్నటికి మొన్న బైక్ మీద వెళుతూ.. సాయం కోసం లిఫ్టు అడిగితే.. బైక్ ఎక్కించుకున్న అపరిచితుడు.. లిఫ్టు ఇచ్చిన పెద్దమనిషి తొంటి మీద విష ఇంజెక్షన్ ఇచ్చి ప్రాణాలు తీసిన వైనం తెలిశాక.. లిఫ్టు కోసం ఎవరు అడిగినా ఇచ్చే పరిస్థితి ఎంతన్నది ఇప్పుడు అనుమానమే. ఇప్పుడు దాదాపుగా అలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది.
ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకొని.. కొత్తగా అనుమానాల్ని తీసుకొచ్చేఈ ఉదంతం మహారాష్ట్రలోని ఫూణె పట్టణంలో చోటు చేసుకుంది. ఐటీ బూమ్ ఉన్న నగరాల్లో ఫూణె ఒకటన్న సంగతి తెలిసిందే.
తాజాగా ఒంటరిగా ఉన్న అమ్మాయి ఒకరు.. ఆన్ లైన్ లో ఫుడ్ ను ఆర్డర్ చేసింది. ఒక ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ ద్వారా ఆమె ఈ సేవను వినియోగించుకున్నారు.
ఆర్డర్ తీసుకొచ్చిన డెలివరీ బాయ్.. ఇంట్లో ఆ అమ్మాయి ఒక్కతే ఉందన్న విషయాన్ని గమనించి.. మంచినీళ్లు ఇస్తారా? అని అడగటంతో.. పాపం మంచినీళ్లు ఇవ్వకుంటే బాగోదన్న ఉద్దేశంతో ఇస్తానని చెప్పటం.. నీళ్ల కోసం లోపలకు వెళ్లిన వేళ.. ఇంట్లోకి వెళ్లిన ఆ డెలివరీ బాయ్.. మంచినీళ్లతో తిరిగి వచ్చిన ఆమెకు అనూహ్యంగా ముద్దు పెట్టేసి షాకిచ్చాడు. దీంతో.. ఆమె ఆ షాక్ నుంచి తేరుకోవటానికి కాస్తంత సమయం పట్టింది. డెలివరీ బాయ్ చేష్టల్ని బలంగా ప్రతిఘటించటంతో అతగాడు పారిపోయాడు.
తనకు జరిగిన ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఆమె.. స్నేహితుడి సాయంతో పోలీస్ స్టేషన్ కు వెళ్లి.. పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. ఈ నేపథ్యంలో నిందితుడ్ని ట్రాక్ చేసిన పోలీసులు అతడ్ని గంటల వ్యవధిలోనే పట్టేసుకున్నారు.
ఈ ఎపిసోడ్ నేపథ్యంలో డెలివరీ బాయ్ పని చేసే ఫుడ్ డెలివరీ యాప్ స్పందించింది. నిజానికి బాధితురాలు పుడ్ డెలివరీ బాధ్యతను ఒక సంస్థకు ఆర్డర్ ఇస్తే.. మరో సంస్థకు మారిన వైనం ఇప్పుడు కొత్త చర్చకు తెర తీసింది. అసలు అదెలా సాధ్యం? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.ఈ విషయం పోలీసుల విచారణలో తేలనుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.