కంప్యూటర్ యుగంలో కూడా ఇంకా చాలా మంది కులాలను పట్టుకుని వేలాడుతున్నారు. ప్రపంచంలో ఎక్కడ లేని కులాలు భారత్ లోనే రాజ్యం ఏలుతున్నాయి. కులం పేరుతో వేదింపులు ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు అవుతున్నా కూడా దళితులపై దాడులు.. మాటల పర్వం.. బూతులు మాట్లాడటం మాత్రం కొనసాగుతూనే ఉంది. ఉత్తర భారతంలో ఇలాంటి కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఇటీవల తన కూతురు ఒక దళితుడిని పెళ్లి చేసుకుందనే కోపంతో ఆమె తండ్రి నీచంగా వ్యవహరించాడు. కూతురుకు గుండు కొట్టించి.. పుణ్యం స్నానం చేయించాడు. ప్రేమ వివాహం చేసుకున్న భర్త వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నాడు. పోలీసుల వద్దకు చెందిన ఆ అమ్మాయి తన తండ్రి వల్ల ప్రాణ హాని ఉందంటూ ఫిర్యాదు చేసి.. తనకు తన భర్తకు రక్షణ కల్పించాల్సిందిగా వేడుకుంది.
ఈ సంఘటన మద్యప్రదేశ్ లోని బేతుల్ జిల్లాలో చోటు చేసుకుంది. చోప్నా కు చెందిన సాక్షీ యాదవ్ నర్సింగ్ చదువుతోంది. హాస్టల్ లో ఉంటూ కాలేజ్ కు వెళ్తూ ఉండేది. కాలేజ్ లో సాక్షీ కి అమిత్ తో పరిచయం అయ్యింది. ఇద్దరి పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరు కూడా ఇంట్లో వారికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు. కులాలు వేరు అవ్వడం వల్ల ఖచ్చితంగా పెళ్లికి కుటుంబ పెద్దలు ఒప్పుకోరు అనే ఉద్దేశ్యంతో వారిద్దరు కూడా 2020 మార్చిలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి విషయంను సాక్షీ తన కుటుంబ సభ్యులకు 2021 జనవరిలో తెలియజేసింది. ఆ సమయంలోనే సాక్షీ తండ్రి కొట్టి.. అతడి వద్దకు పంపించకుండా బందీ చేశాడట. హాస్టల్ లో ఉన్న తనను తీసుకు వెళ్లి ఇంటి వద్ద బంధించి చిత్రవద చేశారని సాక్షి చెప్పుకొచ్చింది.
తన తండ్రి వల్ల తనకు ప్రాణ హాణి ఉందని పోలీసులకు తెలియజేసింది. నాకు అమిత్ తో విడాకులు ఇప్పించి నాన్న మా కులం వ్యక్తితో పెళ్లి చేయాలనుకుంటున్నాడు. అందుకు అమిత్ ను కూడా ఏమైనా చేసే అవకాశం ఉందని ఆమె పేర్కొంది. అమిత్ ను వీడేందుకు ఒప్పుకోక పోవడంతో నాకు గుండు కొట్టించాడని.. పుణ్య స్నానం చేయించాడని సాక్షి కన్నీరు పెట్టుకుంటూ పోలీసులకు తెలియజేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు సాక్షి తండ్రి ని విచారిస్తున్నారు. అతడిని అరెస్ట్ చేయడంతో పాటు అమిత్ కు లేదా సాక్షికి ఏం జరిగినా కూడా హత్య యత్నం కేసు పెట్టి జైలుకు పంపిస్తామంటూ కౌన్సిలింగ్ చేశారట. ఇంతకు ముందు కూడా ఈ కేసు వ్యవహారంలో పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి ఇరు వర్గాల వారిని కలిపే ప్రయత్నాలు చేశారు. కాని అది మళ్లీ మొదటికి వచ్చిందని ప్రత్యక్ష సాక్ష్యులు అంటున్నారు.