పంజాబ్​ అసెంబ్లీ.. ఇప్పుడు కరోనా హాట్​స్పాట్​

Update: 2020-09-03 11:30 GMT
కరోనా అన్ని రాష్ట్రాల్లో రాజకీయ నాయకులను బెంబేలెత్తిస్తోంది. అభివృద్ధి కార్యక్రమాలు, పరామర్శల పేరిట ప్రజా ప్రతినిధులు నిత్యం జనం మధ్య ఉంటున్నారు. దీంతో వారు ఎక్కువగా వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటికే కరోనాతో  పలు రాష్ట్రాల  సీఎంలు, మంత్రులు,  ఎమ్మెల్యేలు,  ఎంతో మంది ఆస్పత్రుల్లో  చికిత్స పొందుతున్నారు. తమిళనాడు రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలకు కరోనా సోకడంతో.. ఏకంగా అసెంబ్లీని  మూసి చెట్టుకిందే సమావేశాలు జరుపుకున్నారు. ఒక తమిళనాడే  కాదు చాలా రాష్ట్రాల్లో  పెద్ద సంఖ్యలో వైరస్ బారిన పడిన ఎమ్మెల్యేల కారణంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం లేదు. నిరవధికంగా వాయిదా వేస్తున్నాయి.

 తాజాగా  పంజాబ్​ అసెంబ్లీని కూడా కరోనా వణికిస్తున్నది. 117 అసెంబ్లీ సభ్యులున్న పంజాబ్​ అసెంబ్లీలో ఇప్పటివరకు 33 మందికి కరోనా సోకిందంటే వ్యాధి తీవ్రత ఏ రేంజ్​లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే 29 మందికి కరోనా సోకగా.. గురువారం మరో నలుగురు కరోనా బారినపడ్డారు. దీంతో కరోనా సోకిన ఎమ్మెల్యేల సంఖ్య 33కు చేరుకున్నది. ఎమ్మెల్యేలందరికీ మెరుగైన చికిత్సనందిస్తున్నామని సీఎం కెప్టెన్​ అమరీందర్​సింగ్​ చెప్పారు. కరోనాపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. హోం ఐసోలేషన్​లో ఉంటూ సరైన మందులు వాడితే కరోనాను జయించవచ్చని ఆయన పేర్కొన్నారు. కాగా పంజాబ్​లో 22 మంది మంత్రులకు కూడా కరోనా సోకింది. రాష్ట్రంలో మెత్తం 55,508 మంది కరోనా బారినపడ్డారు. 38,147 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 1,512 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
Tags:    

Similar News