తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అట్టహాసంగా పార్టీ పండుగ అయిన మహానాడును విశాఖపట్టణంలో జరుపుతుండగా...ఆయన్ను ఇరకాటంలో పడేసే కామెంట్లను ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు చేశారు. బాబు ఓ కాపీ క్యాట్ అని వ్యాఖ్యానించారు. ఇలా వ్యాఖ్యానించిన టీడీపీ వ్యవస్థాపకుడి కుటుంబ సభ్యులు టీడీపీకి చెందిన మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ ఒకరు కాగా మరొకరు ఆయన సోదరి,బీజేపీ నాయకురాలైన కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి.
దివంగత ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకు పుష్పాంజలి ఘటించిన అనంతరం హరికృష్ణ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు పథకాలే ఇప్పటికీ కొనసాగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ పథకాలనే అందరు కాపీ కొట్టారని, వాటికి కొత్త పథకాలని కలరింగ్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీని ఏర్పాటుచేసిందే బడుగు బలహీనవర్గాల సంక్షేమం కోసమని, ఆ దిశగా ఎన్టీఆర్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు.
కాగా హరికృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేకెత్తించిన సమయంలోనే ఆయన సోదరి అయిన పురంధేశ్వరి సైతం ఇదే తరహా కామెంట్లు చేశారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన పురంధేశ్వరీ మీడియాతో మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం నిరంతరం తపించిన మహామనిషి దివంగత ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. ప్రస్తుతం కూడా ఎన్టీఆర్ పథకాలే కొనసాగుతున్నాయని చెప్పారు.
ఇదిలాఉండగా...మహానాడు సందర్భంగా కార్యక్రమం వేదికగానే తెలుగుదేశం శ్రేణులు ఎన్టీఆర్ జయంతిని నిర్వహించాయి. ఈ సందర్భంగా వేదికపైనే పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కేక్ కట్ చేశారు. అనంతరం ప్రసంగిస్తూ ఎన్టీఆర్ జన్మదినం తెలుగు జాతికి పండుగ రోజు అని అన్నారు. ఒక యుగపురుషుడు పుట్టిన రోజుని, పార్టీ శ్రేణులందరి సమక్షంలో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/